Cesarean Delivery: సిజేరియన్ కాన్పులపై స్పెషల్ ఫోకస్.. ప్రైవేటు ఆసుపత్రులపై నిఘా.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులపై వైద్యశాఖ నిఘా పెంచింది. ప్రత్యేకించి నిబంధనలకు విరుద్ధంగా సిజేరియన్లు చేస్తున్న ఆసుపత్రులపై ఫోకస్ చేసింది. అవసరం లేకున్నా ఆపరేషన్లు చేస్తున్నారనే ఆరోపణలతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 104 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చింది. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో 8 ఆసుపత్రులకు నోటీసులిచ్చింది. గడచిన ఐదేళ్లలో మూడు ఆసుపత్రుల్లోనే మూడువేల 40 ఆపరేషన్లు జరిగినట్లు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులపై వైద్యశాఖ నిఘా పెంచింది. ప్రత్యేకించి నిబంధనలకు విరుద్ధంగా సిజేరియన్లు చేస్తున్న ఆసుపత్రులపై ఫోకస్ చేసింది. అవసరం లేకున్నా ఆపరేషన్లు చేస్తున్నారనే ఆరోపణలతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 104 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చింది. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో 8 ఆసుపత్రులకు నోటీసులిచ్చింది. గడచిన ఐదేళ్లలో మూడు ఆసుపత్రుల్లోనే మూడువేల 40 ఆపరేషన్లు జరిగినట్లు గుర్తించారు. కర్నూలు, వెస్ట్ గోదావరి, అనంతపురం, తిరుపతి, వైఎస్‌ఆర్ జిల్లాల్లో రాష్ట్రంలోనే ఎక్కువ సిజేరియన్లు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏడాదిలోనే రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల 27వేల 954 C సెక్షన్ ఆపరేషన్లు జరిగినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ ఆరోపణలను ప్రైవేటు ఆసుపత్రులు ఖండిస్తున్నాయి. రిస్కు ఉన్నవారికే సిజేరియన్ చేస్తున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. ఆడిటింగ్ పూర్తయ్యాక అవసరం ఉన్నా లేకున్నా సిజేరియన్లు చేసే ఆసుపత్రులపై చర్యలకు రెడీ అయ్యింది వైద్యశాఖ. నార్మల్ డెలివరీలు పెంచేందుకు క్యాంపెయిన్ సైతం ప్రారంభించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.