Heart Touching Incident : గుండెపోటుతో అన్న మృతి, శవానికి రాఖీ కట్టిన చెల్లి
గుండె పోటు.. ఇటీవల పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు చాలా మందిని బలి తీసుకుంటుంది. అప్పటిదాకా ఎంతో ఉత్సాహంగా ఉన్న వాళ్లు కూడా అకస్మాత్తుగా కుప్పకూలి పోతున్నారు. తాజాగా పండుగ పూట పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. రాఖీ పండుగ వచ్చిందంటే చాలు తమ సోదరులకు రాఖీ కట్టాలని ఆరాటపడుతుంటారు తోబుట్టువులు. అందరిలానే ఓ చెల్లి కూడా తన అన్నకు రాఖీ కట్టేందుకు ఆనందంగా తన పుట్టింటికి వచ్చింది.
గుండె పోటు.. ఇటీవల పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు చాలా మందిని బలి తీసుకుంటుంది. అప్పటిదాకా ఎంతో ఉత్సాహంగా ఉన్న వాళ్లు కూడా అకస్మాత్తుగా కుప్పకూలి పోతున్నారు. తాజాగా పండుగ పూట పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. రాఖీ పండుగ వచ్చిందంటే చాలు తమ సోదరులకు రాఖీ కట్టాలని ఆరాటపడుతుంటారు తోబుట్టువులు. అందరిలానే ఓ చెల్లి కూడా తన అన్నకు రాఖీ కట్టేందుకు ఆనందంగా తన పుట్టింటికి వచ్చింది. అయితే అత్యంత విషాదకర రీతిలో మృతదేహానికి రాఖీ కట్టాల్సి వచ్చింది. ఈ దృశ్యాన్ని గ్రామస్థులను సైతం కన్నీరు పెట్టించింది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్టకి చెందిన చౌదరి కనకయ్య రాఖీ కట్టేందుకు వచ్చి చెల్లెలు గౌరమ్మతో సంతోషంగా గడిపారు. ఇంతలోనే కనకయ్య ఒక్కసారిగా గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అప్పటిదాకా ఉత్సాహంగా ఉండి ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. అన్నకు రాఖీ కట్టడానికి వచ్చిన ఆయన సోదరి.. పుట్టెడు దుఖంతో కడసారిగా.. కనుకయ్య మృతదేహానికి రాఖీ కట్టి సాగనంపింది. చెల్లెలు అనురాగాన్ని చూసిన గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Blue Moon: వినీలాకాశంలో అరుదైన దృశ్యం.. మళ్లీ చూడాలంటే తొమ్మిదేళ్లు ఆగాల్సిందే !!
అమెజాన్ మేనేజర్ దారుణ హత్య.. అసలు ఏం జరిగిందంటే ?
అదృష్టం వెంటే వస్తున్నప్పుడు.. యముడైనా ఆగిపోవాల్సిందే !!
Naveen Polishetty: అనుష్క తీరుతో.. తీవ్రంగా కష్టపడుతున్న పొలిశెట్టి
TOP 9 ET News: గుడ్ న్యూస్.. ఆ హిట్ సినిమాకు సీక్వెల్ వస్తోంది | ఆ న్యూస్‌పై నాగచైతన్య సీరియస్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

