పిల్లలను ఎస్‌ఐలను చేయడానికి.. పేపర్ లీక్‌ చేసిన పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుడు

|

Sep 04, 2024 | 7:42 PM

కంచే చేనును మేసిన చందంగా ఉంది రాజస్థాన్‌లో ఎస్‌ఐ పరీక్షల వ్యవహారం. ఆ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుడే తన పిల్లలను సబ్‌-ఇన్‌స్పెక్టర్లుగా ఎంపిక చేయడానికి పరీక్షపత్రం లీక్‌ చేసిన వైనం బయటపడింది. 2021లో నాటి రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుడు రాము రాం రైకా తన కుమారుడు, కుమార్తె కోసం ఆ ఏడాది ఎస్‌ఐ పరీక్షల పత్రం లీక్‌ చేశాడు. ఈ పరీక్షలో అతడి పిల్లలు ఇద్దరూ టాపర్లుగా నిలిచారు. ఈ కేసులో అధికారులు రైకాను అరెస్టు చేశారు.

కంచే చేనును మేసిన చందంగా ఉంది రాజస్థాన్‌లో ఎస్‌ఐ పరీక్షల వ్యవహారం. ఆ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుడే తన పిల్లలను సబ్‌-ఇన్‌స్పెక్టర్లుగా ఎంపిక చేయడానికి పరీక్షపత్రం లీక్‌ చేసిన వైనం బయటపడింది. 2021లో నాటి రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుడు రాము రాం రైకా తన కుమారుడు, కుమార్తె కోసం ఆ ఏడాది ఎస్‌ఐ పరీక్షల పత్రం లీక్‌ చేశాడు. ఈ పరీక్షలో అతడి పిల్లలు ఇద్దరూ టాపర్లుగా నిలిచారు. ఈ కేసులో అధికారులు రైకాను అరెస్టు చేశారు. రైకా 2018-2022 వరకు ఆర్పీఎస్‌సీ సభ్యుడిగా ఉన్నాడు. ఈ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే రైకా పిల్లలు ట్రైనీ ఎస్‌ఐలు శోభా, దేవేశ్‌ను అధికారులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో అరెస్టైన ట్రైనీ ఎస్‌ఐలకు అధికారులు మళ్లీ అదే పరీక్ష నిర్వహించారు. వారికి వచ్చిన గత, ఇప్పటి మార్కులు చూసి అధికారులకు కళ్లు తిరిగినంత పనైంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓవర్‌టైమ్ చేసి గుండె వ్యాధుల బారిన పడుతున్న ఉద్యోగులు

10కి పైగా డ్రోన్లు, క్షిపణులతో ఉక్రెయిన్‌​పై రష్యా దాడి

Ganesh Chaturthi: వినాయకుడి తొండం ఆ వైపు ఉంటే అదృష్టం