Ram Jyoti: జనవరి 22 రోజు ప్రతి ఇంటా రామజ్యోతి వెలిగించండి.. మోదీ పిలుపు.

|

Jan 02, 2024 | 6:54 PM

అయోధ్యలో రామ మందిర నిర్మాణం కల సాకారమైన నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక సందేశం ఇచ్చారు. అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం దేశ ప్రజలందరికీ దీపావళి వంటిదని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అందుకే జనవరి 22న రాత్రి దేశమంతా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంట్లో రామ జ్యోతి వెలిగించి దీపావళి వేడుకలు జరుపుకోవాలని సూచించారు. అలాగే జనవరి 14 నుంచి దేశవ్యాప్తంగా అన్ని తీర్థక్షేత్రాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

అయోధ్యలో రామ మందిర నిర్మాణం కల సాకారమైన నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక సందేశం ఇచ్చారు. అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం దేశ ప్రజలందరికీ దీపావళి వంటిదని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అందుకే జనవరి 22న రాత్రి దేశమంతా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంట్లో రామ జ్యోతి వెలిగించి దీపావళి వేడుకలు జరుపుకోవాలని సూచించారు. అలాగే జనవరి 14 నుంచి దేశవ్యాప్తంగా అన్ని తీర్థక్షేత్రాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానితులు మాత్రమే రావాలని, జనవరి 23 తర్వాత ప్రజలంతా అయోధ్యకు రావొచ్చని తెలిపారు. అయోధ్యను శుభ్రంగా ఉంచే బాధ్యత అయోధ్య వాసులదే అన్న మోదీ, అయోధ్యధామ్‌లో ఎక్కడా అపరిశుభ్రత కనిపించరాదన్నారు. అయోధ్యరాముడు ఒకప్పుడు టెంట్‌లో ఉండేవాడని, ఇప్పుడు భవ్య రామమందిరంలో స్వామివారిని ప్రతిష్టించుకోవడం సంతోషంగా ఉందన్నారు ప్రధాని. అయోధ్య విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టడం ఆనందంగా ఉందన్న మోదీ, వాల్మీకి మహర్షి.. శ్రీరాముడు చేసిన మంచి కార్యాలను రామాయణం ద్వారా మనకు పరిచయం చేశారన్నారు. ఆధునిక భారత్​ లో, మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, అయోధ్య ధామ్ రెండూ రామమందిరంతో మనల్ని కలుపుతాయన్నారు. ప్రస్తుతం అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ కు 10-15 వేల మందికి సేవలందించే సామర్థ్యం ఉంది. ఈ స్టేషన్ పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత, ప్రతి రోజూ 60 వేల మంది అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్‌ నుంచి రాకపోకలు సాగించవచ్చని ప్రధాని వివరించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.