Rain Alert: మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!

|

Apr 16, 2024 | 8:11 PM

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ మండిపోతున్నాడు. సూర్య ప్రతాపంతో ఎండ వేడికి తట్టుకోలేక జనం అల్లాడిపోతున్నారు. చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీలకు పైనే నమోదవుతోంది. అయితే తెలంగాణలో గత మూడు రోజులుగా వాతావరణం లో మార్పులు ఏర్పడ్డాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నా మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఎండలనుంచి ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ మండిపోతున్నాడు. సూర్య ప్రతాపంతో ఎండ వేడికి తట్టుకోలేక జనం అల్లాడిపోతున్నారు. చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీలకు పైనే నమోదవుతోంది. అయితే తెలంగాణలో గత మూడు రోజులుగా వాతావరణం లో మార్పులు ఏర్పడ్డాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నా మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఎండలనుంచి ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ చల్లటికబురు చెప్పింది. ఈ వానలు కంటిన్యూ అవుతాయని, వచ్చే పది రోజుల పాటు ఎండ తీవ్రత తగ్గి.. పలు చోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆ తర్వాత మాత్రం ఎండ తీవ్రత పెరిగే సూచనలు ఉన్నట్టు స్పష్టం చేసింది.

వచ్చే పది రోజులపాటు అంటే.. ఈ నెల 25 వరకు రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదవుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో ఏప్రిల్‌ 18 నుంచి 25 వరకు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ అంచనా వేసింది. రాజస్థాన్‌ మీదుగా నైరుతి రుతుపవనాలు తుఫానుగా మారి కోస్తా కర్ణాటక వరకు వ్యాపించాయని తెలిపింది. మరో ఐదురోజులపాటు హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. మరోవైపు గురు, శుక్ర, శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అయితే ఈ అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు కురుస్తుండటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!

Follow us on