Rain Alert: పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు

|

May 10, 2024 | 10:28 PM

మొన్నటి వరకూ ఎండలతో సూర్యుడు ఠారెత్తిస్తే... మంగళవారం ఒక్కసారిగా వరుణుడు కుండపోత వర్షంతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎండలనుంచి కాస్త ఉపశమనం కలిగించాడు. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. 5 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, తూర్పు విదర్భ, మహారాష్ట్రలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ, ఏపీలోని రాయలసీమల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది.

మొన్నటి వరకూ ఎండలతో సూర్యుడు ఠారెత్తిస్తే… మంగళవారం ఒక్కసారిగా వరుణుడు కుండపోత వర్షంతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎండలనుంచి కాస్త ఉపశమనం కలిగించాడు. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. 5 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, తూర్పు విదర్భ, మహారాష్ట్రలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ, ఏపీలోని రాయలసీమల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ నేపథ్యంలో ఐదు రోజుల పాటు వాతావరణం చల్లగా ఉంటుందని తెలిపింది.

తెలంగాణలో రానున్న 24 గంటల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 37 డిగ్రీల వరకు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రంగారెడ్డి, ములుగు, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. పలు చోట్ల వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే, ఎన్నికలు జరగనున్న మే 13వ తేదీన కూడా తెలంగాణ, ఏపీల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం అక్కడక్కడ వర్షం కురిసింది. వర్షం కారణంగా పలు మార్కెట్ యార్డ్ లలో ఉంచిన పంటలు తడిసిపోయాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on