Highway Lorry Accident: హైవేపై లారీ బీభత్సం.. 48 వాహనాలు ధ్వంసం.. 30 మందికి సీరియస్.!
మహారాష్ట్రలోని పుణెలో ఘోర ప్రమాదం జరిగింది. పుణె-బెంగళూరు హైవేపై ఓ ట్యాంకర్ లారీ బీభత్సం సృష్టించింది. ముందు ఉన్న వాహనాలపైకి వరుసగా దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 48 వాహనాలు ధ్వంసమయ్యాయి.
మహారాష్ట్రలోని పుణెలో ఘోర ప్రమాదం జరిగింది. పుణె-బెంగళూరు హైవేపై ఓ ట్యాంకర్ లారీ బీభత్సం సృష్టించింది. ముందు ఉన్న వాహనాలపైకి వరుసగా దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 48 వాహనాలు ధ్వంసమయ్యాయి. సుమారు 30 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పుణెలోని నావెల్ వంతెనపై ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పుణె మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి సంస్థ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ట్యాంకర్ లారీ వేగంగా వెళ్తుండగా బ్రేకులు పని చేయకపోవటంతో ముందు వెళ్తున్న వాహనాలను ఢీకొట్టింది. అందులోని చమురు రోడ్డుపై పడటంతో పలు వాహనాలు నియంత్రణ కోల్పోయి ముందున్న వాహనాలను ఢీకొట్టాయి. మొత్తంగా 48 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. కాగా ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు
వాహనాదారులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి టోల్ ఫ్రీ

