AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొన్న విజయవాడ.. నిన్న అనంతపురంవరద విలయం వెనుక కారణాలేంటి ??

మొన్న విజయవాడ.. నిన్న అనంతపురంవరద విలయం వెనుక కారణాలేంటి ??

Phani CH
|

Updated on: Oct 24, 2024 | 12:32 PM

Share

వర్షం పడితే ఉలిక్కిపడాల్సి వస్తోంది. ఎక్కడ ఏ వాగు పొంగుతుందో, ఎక్కడ ఏ వంక ముంచుతుందో, ఎక్కడ ఏ చెరువు గట్టు తెగుతుందో అని టెన్షన్ పడాల్సిన పరిస్థితి నెలకొంది. విజయవాడను ముంచెత్తిన బుడమేరును చూసి.. భయపడ్డారు. ఇప్పుడు అనంతపురంలో అలాంటి దృశ్యాలే కనిపించాయి. విజయవాడను బుడమేరు ముంచితే.. అనంతపురాన్ని పండమేరు ముంచెత్తింది. అసలే కరవుతో అల్లాడిపోయే రాయలసీమలో.. ఈ వర్షాలేంటి?

అందులోనూ అనంతపురంలో ఈ వరదలేంటి? వర్షపు చుక్క కోసం, నీటి జాడ కోసం ఎదురుచూపులు చూసే గడ్డపై ఇలా వర్షం ముంచెత్తేసరికి ఒక్కసారిగా జనజీవనం స్తంభించింది. కనగానిపల్లి మండలంలో 19 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఈ మండలంలో ఉన్న 13 చెరువులూ పూర్తిగా నిండిపోయాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కురిసిన వర్షాలతో బండమీదపల్లితో పాటు మరికొన్ని చెరువులు ఉప్పొంగాయి. కనగానపల్లి చెరువు కట్ట తెగి.. పండమేరు వాగును ముంచెత్తింది. దీంతో వాగులో నీటి ఉధృతి పెరిగింది. ఈ వాగు ఒక్కసారిగా విరుచుకుపడడంతో పలు కాలనీలు నీట మునిగాయి. అది కూడా తెల్లవారుజామున ఈ ఘటన జరగడంతో.. ప్రజలకు ఏం చేయాలో కూడా పాలుపోలేదు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లే సమయం కూడా వారికి లేకుండా పోయింది. ప్రాణాలను కాపాడుకోవడమే ధ్యేయంగా వారు అక్కడి నుంచి బయటపడడానికి ప్రయత్నించారు. అక్కడికీ కొంతమంది ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: TOP 9 ET News: సూర్య, అమీర్‌తో.. అల్లు అరవింద్ పాన్ ఇండియా సీక్వెల్ ప్రభాస్, సమంత ఇంతవరకు ఎందుకు కలిసి నటించలేదో తెలుసా ?? అప్పుడే పుట్టిన తన కూతురి కోసం కోట్లు పోసి లగ్జరీ కార్‌ కొన్న స్టార్ హీరో విష్ణుకు బ్రేకప్ చెప్పిన పృథ్వీ !! ఉన్న చోట ఉండక పుల్ల పెట్టిన యష్మి ఒక్క వీడియోతో.. అందరికీ మత్తు వదిలించిన రియా దొరికేసింది ??