YCP Leaders: పవన్ , బాబు భేటీపై వైసీపీ వరస మాటల తూటాలు.. సంక్రాంతి మామూళ్లు కోసం వెళ్లిన దత్త పుత్రుడంటూ..
చంద్రబాబు, పవన్ భేటీపై మంత్రి అంబటి సెటైర్లు వేశారు. సంక్రాంతికి అందరింటికీ గంగిరెద్దులు వెళ్తాయని, అదే విధంగా చంద్రబాబు ఇంటికి డూడూ బసవన్నలా తల ఊపడానికి పవన్ కల్యాణ్ వెళ్లారని..
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో చంద్రబాబు,పవన్ తాజా భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. దాంతోపాటు ఇటీవల కుప్పంలో జరిగిన ఘటనలు, సభలు, సమావేశాలపై నిషేధం విషయంలో ఏపీ సర్కార్ జారీచేసిన జీవో1పై చర్చించినట్లు సమాచారం.చంద్రబాబు, పవన్ భేటీపై మంత్రి అంబటి సెటైర్లు వేశారు. సంక్రాంతికి అందరింటికీ గంగిరెద్దులు వెళ్తాయని, అదే విధంగా చంద్రబాబు ఇంటికి డూడూ బసవన్నలా తల ఊపడానికి పవన్ కల్యాణ్ వెళ్లారని వ్యంగ్యంగా కామెంట్ చేశారు మంత్రి అంబటి. పవన్, చంద్రబాబు భేటీపై మంత్రి అమర్నాథ్ ట్వీట్ చేశారు. సంక్రాంతి మామూళ్ల కోసం దత్త తండ్రి దగ్గరకు దత్తపుత్రుడు వెళ్లారని వ్యంగ్యంగా కామెంట్ చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos