Big News Big Debate: ఏది పవిత్రం.. ఏది అపవిత్రం..! ఏపీలో పొత్తులపై జోరుగా ఊహాగానాలు
ముందస్తు ఆలోచన లేదంటూ స్పష్టత ఇచ్చిన ఏపీ ప్రభుత్వ సలహాదారు చంద్రబాబు - పవన్ భేటి నేపథ్యంలో వారిది అపవిత్ర, అక్రమ బంధంగా వర్ణించారు.
ముందస్తు ఆలోచన లేదంటూ స్పష్టత ఇచ్చిన ఏపీ ప్రభుత్వ సలహాదారు చంద్రబాబు – పవన్ భేటి నేపథ్యంలో వారిది అపవిత్ర, అక్రమ బంధంగా వర్ణించారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్ భేటీ అయ్యారని ఆరోపించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. గుంటూరు, కందుకూరు ఘటనల్లో మృతుల కుటుంబాలను పరామర్శించకుండా.. చంద్రబాబుకు సంఘీభావం తెలపడమేంటని ప్రశ్నించారు. అసలు పవన్ – చంద్రబాబు అంతేసేపు కలిసి ఏం చర్చించారని ప్రశ్నించారు సజ్జల. రెండు పార్టీల అధినేతలు కలిస్తే అధికార పార్టీ ఎందుకు ఉలిక్కిపడుతుందో అర్ధం కావడం లేదంటోంది జనసేన. జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న పార్టీలు అవసరం అయితే ఎన్నికల్లో పొత్తులతో వెళతాయన్న సీపీఐ నేత వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.