PM Modi: చెస్ ఛాంపియన్‌లతో ప్రధాని మోదీ కీలక భేటి.. వీడియో వైరల్
బుడాపెస్ట్‌లో జరిగిన 45వ చెస్ ఒలింపియాడ్‌లో భారత యువ చెస్ క్రీడాకారులు చారిత్రాత్మక విజయాన్ని సాధించడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. తొలిసారిగా పురుషులు, మహిళల జట్లు బంగారు పతకాలను కైవసం చేసుకున్నాయి.
బుడాపెస్ట్‌లో జరిగిన 45వ చెస్ ఒలింపియాడ్‌లో భారత యువ చెస్ క్రీడాకారులు చారిత్రాత్మక విజయాలు అందుకున్న సంగతి తెలిసిందే. ఇక టోర్నమెంట్ అనంతరం స్వదేశానికి చేరుకున్న వారు.. బుధవారం ప్రధాని మోదీని తన నివాసంలో కలుసుకున్నారు. వారంతా కూడా బంగారు పతకాలను సాధించడం, భారత్‌ను గర్వపడేలా చేయడం తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు ప్రధాని మోదీ. చెస్ ఛాంపియన్స్‌ను ఒక్కొక్కరిగా ప్రశంసించారు ఆయన. తొలిసారిగా చెస్‌లో పురుషులు, మహిళల జట్లు బంగారు పతకాలను కైవసం చేసుకున్నాయి. ఆదివారం పురుషుల జట్టు స్లోవేనియాను ఓడించి, మహిళల జట్టు ఆఖరి రౌండ్‌లో అజర్‌బైజాన్‌పై విజయం సాధించి, ప్రతిష్టాత్మక చెస్ ఈవెంట్‌లో తొలిసారిగా స్వర్ణ పతకాలను కైవసం చేసుకోవడంతో భారత్ చరిత్ర సృష్టించింది. పురుషుల పోటీలో గుకేశ్, అర్జున్ ఎరిగైసి, ఆర్ ప్రజ్ఞానానంద చివరి రౌండ్‌లో నిర్ణయాత్మక విజయాలు సాధించారు. మహిళల జట్టు అజర్‌బైజాన్‌ను ఓడించి స్వర్ణం ఖాయం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఆర్ వైశాలి, డి హారిక, తానియా సచ్‌దేవ్, విదిత్ గుజరాతీ, అర్జున్ ఎరిగైసి, ప్రగ్నానందతో సహా చెస్ ఛాంపియన్‌లతో ప్రధాని మోదీ ఇంటరాక్ట్ అయ్యారు.
ఇది చదవండి: మీరు మాట్లాడే విధానం.. మీరు ఎలాంటి వారో చెప్పేస్తుంది.! ఎలాగంటే
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో

