Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thummala Vs Puvvada: పూలు vs ముళ్లు ముదురుతున్న మాటల యుద్ధాలు.! లైవ్

Thummala Vs Puvvada: పూలు vs ముళ్లు ముదురుతున్న మాటల యుద్ధాలు.! లైవ్

Anil kumar poka

|

Updated on: Nov 06, 2023 | 9:21 AM

ఔర్‌ ఏక్‌ దక్కా.. హ్యాట్రిక్‌ పక్కా. మూడోస్సారి జయం మనదే అంటూ ప్రచారంలో దూసుకెళ్తోంది BRS.ప్రజా ఆశీర్వాద సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు సీఎం కేసీఆర్‌. నిన్న ఖమ్మం జిల్లా ప్రజాశీర్వాద సభలో ఆయన మాటలు... మంటలు పుట్టించాయి. సరికొత్తగా ప్రవచించిన పూల-ముళ్ల సిద్ధాంతం జిల్లా రాజకీయాల్లో మాటల యుద్ధానికి కారణమయ్యాయి. ఓసారి తన ఒకప్పటి చిరకాల మిత్రుడు.. ప్రస్తుత శత్రువు ఖమ్మం జిల్లా రాజకీయాలను శాసించే నేతల్లో ఒకరైన తుమ్మలను ఉద్ధేశించి ఆయన మాట్లాడిన మాటలు, అలాగే తన పార్టీ అభ్యర్థి, మంత్రి పువ్వాడపై పొగడ్తలు ఇప్పుడొసారి చూద్దాం.

ఔర్‌ ఏక్‌ దక్కా.. హ్యాట్రిక్‌ పక్కా. మూడోస్సారి జయం మనదే అంటూ ప్రచారంలో దూసుకెళ్తోంది BRS.ప్రజా ఆశీర్వాద సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు సీఎం కేసీఆర్‌. నిన్న ఖమ్మం జిల్లా ప్రజాశీర్వాద సభలో ఆయన మాటలు… మంటలు పుట్టించాయి. సరికొత్తగా ప్రవచించిన పూల-ముళ్ల సిద్ధాంతం జిల్లా రాజకీయాల్లో మాటల యుద్ధానికి కారణమయ్యాయి. ఓసారి తన ఒకప్పటి చిరకాల మిత్రుడు.. ప్రస్తుత శత్రువు ఖమ్మం జిల్లా రాజకీయాలను శాసించే నేతల్లో ఒకరైన తుమ్మలను ఉద్ధేశించి ఆయన మాట్లాడిన మాటలు, అలాగే తన పార్టీ అభ్యర్థి, మంత్రి పువ్వాడపై పొగడ్తలు ఇప్పుడొసారి చూద్దాం.

వార్ .. వన్ సైడ్ కాదు.. ఎందుకంటే ఖమ్మంలో కాంగ్రెస్ ఇప్పుడు కాక మీద ఉంది. ఎలాగైనా పదికి పది సీట్లు సాధించాలన్న పట్టుదల జిల్లా నేతల్లోనూ, రాష్ట్ర నేతల్లోనూ కనిపిస్తోంది. అందుకే నువ్వు ఒకటంటే..నేను రెండంటా అంటూ యాక్షన్.. రియక్షన్ ఎపిసోడ్స్… భలే రంజుగా నడుస్తున్నాయి. కేసీఆర్ పూలు.. ముళ్ల సిద్ధాంతం చెబితే.. తుమ్మల.. ఆ సిద్ధాంతాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. కేసీఆర్ పై ఎదురుదాడే లక్ష్యంగా మాటల తూటాలు పేల్చారు. ఓ సారి ఆయనేమన్నారో చూద్దాం.రోజు రోజుకీ ఎన్నికల ప్రచారం ఎంత వాడీగా.. వేడిగా సాగుతుందో చెప్పడానికి ఈ మాటల యుద్ధాలే సాక్ష్యం. ఇక ఇవాళ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు కేసీఆర్. దేవరకద్ర, గద్వాల, మక్తల్‌, నాయరాయణపేట బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఇక ఇవాళ ఎవర్ని టార్గెట్ చెయ్యబోతున్నారు..? గత వారంలో ఇదే జిల్లాలో రాహుల్ సభలు జరిగాయి. ఇప్పుడు కేసీఆర్ వెళ్తున్నారు. దీంతో పాలమూరు రాజకీయం ఇక ఏ స్థాయిలో హీటు పుట్టించనుందో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.