Khammam: కేసీఆర్‌కు మంత్రి పదవి ఇప్పించింది నేనే- తుమ్మల
తెలంగాణలో ఎన్నికల ప్రచారం మంచి జోరుగా సాగుతుంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పంచ్ డైలాగ్‌లు, కౌంటర్లతో సీఎం కేసీఆర్ ఖమ్మం ఎన్నికల ప్రచారం సాగింది. పొంగులేటి, తుమ్మలపై కేసీఆర్ సెటైర్లు వేశారు. దీనికి కౌంటర్‌గా కేసీఆర్, పువ్వాడను టార్గెట్ చేశారు తుమ్మల. ఆయనేమన్నారో ఈ వీడియోలో చూద్దాం పదండి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ కొత్తగూడెం, ఖమ్మం సభల్లో పాల్గొన్నారు. ఖమ్మంలో పువ్వాడ అజయ్‌ని గెలిపిస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటారని.. కాదని తుమ్మలు, తుప్పలు తెచ్చుకుంటే తుమ్మ ముళ్లు గుచ్చుకుంటాయని కేసీఆర్ హెచ్చరించారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావును పంచతంత్ర కథల్లోని కరకట దమనకులతో పోల్చారు కేసీఆర్.
కేసీఆర్ సెటైర్లకు కౌంటరిచ్చారు తుమ్మల. పువ్వాడ పూజకు పనికి రాని పువ్వన్నారాయన. కేసిఆర్ కు మంత్రి పదవి ఇప్పించింది తానేనని కావాలంటే చంద్రబాబుని అడగవచ్చన్నారు తుమ్మల. కేసీఆర్ సెటైర్లపై పొంగులేటి కౌంటర్ కోసం పార్టీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
Latest Videos