AP Elections: రామరాజును వదులుకోనంటూ చంద్రబాబు భరోసా.. అయినా..
సీటుపై నాన్చుడు ఎందుకంటున్నారు ఉండి టీడీపీ క్యాడర్. తమకు రఘురామకృష్ణరాజు కాదు రామరాజే కావాలన్నారు. రఘురామను అంతా జగన్ బాధితుడిగా చూశారని.. రామరాజు ఉండి నియోజవర్గానికి కావాల్సిన వ్యక్తని చెప్తున్నారు. ఈ ఉండి సీటు విషయంలో ఇలాగే నాన్చితే 2-3 రోజుల్లో కఠిన నిర్ణయం తప్పదని కొందరు ద్వితీయ శ్రేణి నేతలు చెప్తున్నారు.
ఉండి టికెట్‌పై టీడీపీలో హైడ్రామా కొనసాగుతోంది. ఇవాళ ఎమ్మెల్యే రామరాజును ప్రత్యేకంగా పిలిచి మాట్లాడారు చంద్రబాబు.. రామరాజును వదులుకోలేనంటూ కార్యకర్తల ముందే భరోసా ఇచ్చినా.. ఎందుకీ నాన్చుడు అనే మాటే క్యాడర్ నుంచి వినిపించింది. మరో 2 రోజులు సంయమనం పాటించాలని చంద్రబాబు వారికి సూచించారు. రామరాజు ఎన్నికల్లో బాగా పనిచేశారని, రామరాజు తన సొంత విషయం అని ఎట్టిపరిస్థితుల్లో వదులుకోను అని చెప్పుకొచ్చారు. ఐతే.. అభిమానం చూపిస్తూ సీటుపై నాన్చుడు ఎందుకంటున్నారు ఉండి టీడీపీ క్యాడర్.
తమకు రఘురామకృష్ణరాజు కాదు రామరాజే కావాలన్నారు. రఘురామను అంతా జగన్ బాధితుడిగా చూశారని.. రామరాజు ఉండి నియోజవర్గానికి కావాల్సిన వ్యక్తని చెప్తున్నారు. ఈ ఉండి సీటు విషయంలో ఇలాగే నాన్చితే 2-3 రోజుల్లో కఠిన నిర్ణయం తప్పదని కొందరు ద్వితీయ శ్రేణి నేతలు చెప్తున్నారు.
– ఇవాళ భేటీకి కార్యకర్తలను పిలిపించుకొన్న చంద్రబాబు.. ఒకరిద్దరితోనే మాట్లాడితే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు రెండు నిమిషాలు కూడా మాట్లాడే సమయం ఇవ్వరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా వైసీపీ వాళ్ల చేతుల్లో దెబ్బలు తిన్నామని, ఇప్పుడు రామరాజుకు టికెట్ నిరాకరించడం కరెక్ట్ కాదని వారంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

