Telangana:  దూకుడుగా బీజేపీ.. రామాయంపేటలో రఘునందన్ ప్రచారం

Telangana: దూకుడుగా బీజేపీ.. రామాయంపేటలో రఘునందన్ ప్రచారం

Ram Naramaneni

|

Updated on: Apr 12, 2024 | 1:29 PM

 మెదక్ జిల్లా రామాయంపేటలో రఘునందన్‌రావు రోడ్‌ షో నిర్వహించారు..గల్లీగల్లీకి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు. స్థానిక సమస్యలను తెలుసుకోవడంతో పాటు హామీల వర్షం కురిపిస్తున్నారు..KCR తరహాలోనే రేవంత్ రెడ్డి పాలిస్తున్నారని ఆరోపించారు.

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచుతోంది.ఇప్పటికే సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తుండగా..ఇప్పుడు మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు కూడా ఎన్నికల ప్రచారంలోకి దిగారు.  మెదక్ జిల్లా రామాయంపేటలో రఘునందన్‌రావు రోడ్‌ షో నిర్వహించారు..గల్లీగల్లీకి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు. స్థానిక సమస్యలను తెలుసుకోవడంతో పాటు హామీల వర్షం కురిపిస్తున్నారు..KCR తరహాలోనే రేవంత్ రెడ్డి పాలిస్తున్నారని ఆరోపించారు..ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్‌ విఫలమైందన్నారు..మోదీతోనే భారతదేశ అభివృద్ధి సాధ్యమన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Published on: Apr 12, 2024 01:29 PM