Revanth Reddy: ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మారుస్తాం.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

|

Dec 03, 2023 | 4:05 PM

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. మ్యాజిక్ ఫిగర్ ను దాటి కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది.. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ 66 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.. ఇప్పటికే పలు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. మ్యాజిక్ ఫిగర్ ను దాటి కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది.. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ 66 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.. ఇప్పటికే 35కిపైగా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. గాంధీభవన్‌లో జరిగిన సంబరాల్లో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు.. ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మారుస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 24గంటల పాటు ద్వారాలు తెరుచుకునే ఉంటాయని పేర్కొన్నారు.

అందరి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టబోతుందని టీపీసీసీ ఇన్ ఛార్జ్ మాణిక్ రావ్ థాక్రే పేర్కొన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్ :

తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్ :

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పార్టీల ఫలితాలు లైవ్ :