Watch Video: రాళ్లదాడిపై స్పందించిన మాజీ మంత్రి.. చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు..
కృష్ణా జిల్లా విజయవాడలో నిర్వహించిన మేమంతా సిద్దం బస్సుయాత్రలో సీఎం జగన్పై జరిగిన రాళ్లదాడి జరిగింది. ఇదే క్రమంలో ఆయన పక్కన ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి ఎడమ కంటికి కూడా తీవ్రగాయం అయింది. ప్రస్తుతం కంటి లోపల గాయం అయినట్లు గుర్తించిన వైద్యులు ఆయన కంటికి చికిత్స అందించి కట్టుకట్టారు. విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. నిన్న రాత్రి చికిత్స అనంతరం తెల్లవారుజామున తన నివాసానికి చేరుకున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్. 24 గంటల తరువాత కంటి పరిస్థితి ఏంటన్నది చెప్తమన్నారు డాక్టర్లు.
కృష్ణా జిల్లా విజయవాడలో నిర్వహించిన మేమంతా సిద్దం బస్సుయాత్రలో సీఎం జగన్పై జరిగిన రాళ్లదాడి జరిగింది. ఇదే క్రమంలో ఆయన పక్కన ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి ఎడమ కంటికి కూడా తీవ్రగాయం అయింది. ప్రస్తుతం కంటి లోపల గాయం అయినట్లు గుర్తించిన వైద్యులు ఆయన కంటికి చికిత్స అందించి కట్టుకట్టారు. విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. నిన్న రాత్రి చికిత్స అనంతరం తెల్లవారుజామున తన నివాసానికి చేరుకున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్. 24 గంటల తరువాత కంటి పరిస్థితి ఏంటన్నది చెప్తమన్నారు డాక్టర్లు. అందుకే తన నివాసంలో ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు ఆయన. వెల్లంపల్లి వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఇది ప్రతిపక్షాల కుట్ర అని చెప్పారు వెల్లంపల్లి. దీనిపై సమగ్రమైన దర్యాప్తు జరగాలని కోరారు. జగన్ ను అంతమొందించేందుకే ఈ దాడి చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ను అంతమొందిస్తేనే చంద్రబాబుకు మనుగడ ఉంటుందని కావాలనే ఈ దాడి చేయించినట్లు కీలక ఆరోపణలు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..