గ్యాంగ్ స్టర్ నామినేషన్.. కట్టేసిన చేతులు ముఖానికి నల్లటి గుడ్డతో
పుణె మున్సిపల్ ఎన్నికల్లో సంచలనం రేపిన గ్యాంగ్‌స్టర్ బందు అందేకర్, మనవడి హత్య కేసులో నిందితుడిగా యరవాడ జైలు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు. కోర్టు అనుమతితో పోలీసు బందోబస్తు నడుమ నామినేషన్ వేసిన అందేకర్ కుటుంబ సభ్యులు కూడా పోటీలో ఉన్నారు. ఈ పోటీ పుణె రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
పుణెలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బందు అందేకర్ అనే గ్యాంగ్‌స్టర్ పోటీ చేస్తున్నాడు. మనవడి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా విచారణను ఎదుర్కొంటున్న అందేకర్ ప్రస్తుతం ఎరవాడ సెంట్రల్ జైలులో ఉన్నాడు. కాగా, నామినేషన్ కోసం పోలీసుల బందోబస్తు నడుమ అతడు ప్రభుత్వ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేసాడు. పోలీసు వ్యాన్ లో వచ్చిన బందు అందేకర్ చేతులకు తాళ్లు కట్టి ఉండగా, ముఖానికి నల్లటి గుడ్డ కప్పి ఉంది. భవానీ పేటలోని నామినేషన్ కేంద్రానికి తీసుకురాగానే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ లోపలికి వెళ్లాడు. మనవడు ఆయుష్ కోమ్కర్ హత్య కేసులో అందేకర్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రత్యేక కోర్టు అనుమతి ఇవ్వడంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగాడు. అందేకర్ మాత్రమే కాకుండా, ఇదే కేసులో నిందితులుగా ఉన్న అతడి సోదరుడి భార్య లక్ష్మి అందేకర్, కోడలు సోనాలి అందేకర్ కూడా కోర్టు అనుమతితో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. పుణె మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు మరో 28 సంస్థలకు జనవరి 15న ఎన్నికలు జరగనున్నాయి. మాజీ కార్పొరేటర్, బందు అందేకర్ కుమారుడు వనరాజ్ అందేకర్ గతంలో హత్యకు గురయ్యాడు. దీనికి ప్రతీకారంగానే తన కుమారుడి హతుడైన గణేష్ కోమ్కర్ కుమారుడు, వరుసకు మనవడైన ఆయుష్ కోమ్కర్‌ను సెప్టెంబర్ 5న బందు అండేకర్ కాల్చి చంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ దారుణ హత్య వెనుక అందేకర్ గ్యాంగ్ ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చలి ఎఫెక్ట్.. చుక్కల్లో కూరగాయల ధరలు ఇప్పటికే కేజీ ధర సెంచరీ క్రాస్
వైభవంగా ముగిసిన మండల పూజ.. శరణుఘోషతో ప్రతిధ్వనించిన శబరిగిరులు
‘ధురందర్’ పాక్ ఆసిమ్ మునీర్‌కు వెన్నులో వణుకు
తండ్రి మొక్కు తీర్చటానికి కొడుకు నిర్ణయం.. 120 కి.మీ మేర పొర్లుదండాలు పెడుతూ యాత్ర
పదో అంతస్తు నుంచి జారి పడ్డాడు.. కట్ చేస్తే ఈ విధంగా బ్రతికి బయటపడ్డాడు..
