Droupadi Murmu: జలాంతర్గామిలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Updated on: Dec 28, 2025 | 7:44 PM

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కర్ణాటకలోని కార్వార్ హార్బర్‌లో ఐఎన్ఎస్ వాగ్షీర్ జలాంతర్గామిలో ప్రయాణించారు. చీఫ్ ఆఫ్ నావీ స్టాఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ఆమె వెంట ఉన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ జలాంతర్గామిలో ప్రయాణించిన రెండవ రాష్ట్రపతిగా ముర్ము నిలిచారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చారిత్రాత్మక జలాంతర్గామి ప్రయాణం చేపట్టారు.

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చారిత్రాత్మక జలాంతర్గామి ప్రయాణం చేపట్టారు. కర్ణాటకలోని కార్వార్ హార్బర్ నావీ బేస్ కు చేరుకున్న ఆమె, అక్కడి నుంచి ఐఎన్ఎస్ వాగ్షీర్ సబ్మెరైన్ లో ప్రయాణించి దేశ రక్షణ రంగంలో కీలక ఘట్టాన్ని ఆవిష్కరించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి వెంట చీఫ్ ఆఫ్ నావీ స్టాఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ఉన్నారు. ఐఎన్ఎస్ వాగ్షీర్ ఒక కల్వరీ క్లాస్ జలాంతర్గామి. ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారతదేశంలోనే తయారు చేయబడటం గమనార్హం. ఇది దేశ రక్షణ సామర్థ్యాన్ని, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold and Silver Price: వెండి, బంగారం పరుగులకు 3 కారణాలు

ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి

ఆ విషయం లో ధురంధర్‌ను ఫాలో అవుతున్న Jr. ఎన్టీఆర్

Jailer 02: జైలర్‌ సీక్వెల్‌లో బాలీవుడ్ స్టార్ హీరో.. గెట్ రెడీ బాయ్స్

ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం