విశాఖపట్నం, ఆగస్టు 12: విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇటు పవన్.. అటు అధికార పార్టీ వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పవన్ యాత్ర రెండోరోజు శనివారం విశాఖలో మళ్లీ హడావుడి మొదలైంది. మరి కాసేపట్లో పవన్ CNBC భూముల సందర్శన నేపధ్యంలో పోలీసులను భారీగా మోహరించారు. భద్రతా చర్యల్లో భాగంగా.. పవన్ ప్రయాణించనున్న రెండు కిలోమీటర్ల దూరంలో పలు చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేశారు. పరిమిత సంఖ్యలో నేతల భూముల సందర్శనకు పోలీసుల ఒకే చెబుతున్నారు. ఎక్కువ మంది ఉంటే.. కుదరదంటూ పోలీసులు పేర్కొంటున్నారు. పార్టీ శ్రేణులు, అభిమానులను నిలువరించేందుకు చెక్ పోస్ట్ ల ను ఏర్పాటు చేశారు. CBCNC భూముల చుట్టూ నిర్మాణ సంస్థ ఎంవివీ బిల్డర్స్ షీట్స్ తో ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. వీటిని పవన్ కల్యాణ్ సందర్శించడంతో విశాఖలో మరోసారి టెన్షన్ నెలకొంది.. నిన్న రుషికొండ.. నేడు సీబీసీఎన్‌సీ భూముల సందర్శనతో వైజాగ్ లో టెన్షన్ నెలకొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..