చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారు.. స్కిల్ స్కాం‌తో బాబుకు సంబంధమేంటి? పవన్ కీలక వ్యాఖ్యలు..

Ravi Kiran

|

Updated on: Sep 14, 2023 | 1:36 PM

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు వెళ్లారు.. చంద్రబాబును కలిసేందుకు జైలు లోపలికి వెళ్లారు.. అప్పటికే క్యాంపు ఆఫీసు నుంచి అక్కడికి వచ్చిన బాలకృష్ణ, లోకేష్‌...పవన్‌ కంటే ముందే జైల్లోకి వెళ్లారు..ముగ్గురూ చంద్రబాబుతో ములాఖత్‌లో ఉన్నారు. భవిష్యత్‌ కార్యాచరణపై ఆ నలుగురు చర్చిస్తున్నారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు వెళ్లారు.. చంద్రబాబును కలిసేందుకు జైలు లోపలికి వెళ్లారు.. అప్పటికే క్యాంపు ఆఫీసు నుంచి అక్కడికి వచ్చిన బాలకృష్ణ, లోకేష్‌…పవన్‌ కంటే ముందే జైల్లోకి వెళ్లారు..ముగ్గురూ చంద్రబాబుతో ములాఖత్‌లో ఉన్నారు. భవిష్యత్‌ కార్యాచరణపై ఆ నలుగురు చర్చిస్తున్నారు. దాదాపు 40 నిమిషాలు వీళ్లు చంద్రబాబుతో ములాఖత్‌లో ఉంటారు. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. చంద్రబాబును కలిసిన తర్వాత..ముగ్గురు ప్రత్యేకంగా సమావేశమై..భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నారు.. అయితే ములాఖత్‌ తర్వాత పవన్‌ ఏం మాట్లాడుతారనే దానిపై అటు టీడీపీ, ఇటు జనసేన కేడర్‌ తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తోంది.

పవన్‌ను చూసేందుకు వచ్చి గాయాలపాలైన ఫ్యాన్స్..

రాజమండ్రిలో పవన్ ఫ్యాన్స్‌ అత్యుత్సాహం ప్రదర్శించారు. మధురపూడి గెస్ట్‌ హౌస్‌లో ఉన్న పవన్‌ని చూసేందుకు ఫ్యాన్స్‌ ఎగబడ్డారు..యువకులు కాంపౌండ్‌ వాల్‌ ఎక్కి ప్రమాదకరంగా నిల్చున్నారు. తొక్కిసలాట జరగడంతో..పవన్‌ను చూసేందుకు వచ్చిన మహిళలు ఇబ్బందులు పడ్డారు.

Published on: Sep 14, 2023 12:15 PM