Big News Big Debate: చంద్రబాబు అరెస్టులో రాజకీయముందా? బీజేపీ వ్యూహాత్మక మౌనం పాటిస్తోందా?

Big News Big Debate: చంద్రబాబు అరెస్టులో రాజకీయముందా? బీజేపీ వ్యూహాత్మక మౌనం పాటిస్తోందా?

Ram Naramaneni

|

Updated on: Sep 13, 2023 | 9:00 PM

చంద్రబాబు అరెస్టు అనంతరం ఏపీలో రాజకీయపార్టీల వైఖరి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓపెన్‌గానే జనసేన, లెఫ్ట్ పార్టీలు మద్దతు ప్రకటిస్తే.. బీజేపీ మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. ఇదే ఇప్పుడు పొలిటికల్‌ రచ్చగా మారింది. కేంద్రంలోని పెద్దల సహకారం లేకుండానే చంద్రబాబు స్థాయి వ్యక్తిని అరెస్టు చేస్తారా.. కేంద్రం ఇంటిలిజెన్స్ సమాచారం లేకుండా ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ సానుభూతిపరులు. బీజేపీ ఏపీ నేతల మౌనం టీడీపీలో అనుమానాలకు కారణమవుతోంది.

చంద్రబాబు అరెస్టు తర్వాత ఏపీలో రాజకీయం ఆసక్తికర ములుపులు తీసుకుంటోంది. ఇప్పటి వరకు వైసీపీనే టార్గెట్ చేసిన తెలుగుదేశం నేతలు ఇప్పుడు కేంద్రంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ పాత్ర కూడా ఉందా అంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు అరెస్ట్ అయిన వెంటనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఖండించారు. అనంతరం ఎక్కడా దీనిపై బీజేపీ నేతలెవరూ స్పందించలేదు. మీడియాకు ముఖం చాటేశారు. దీంతో సహజంగానే టీడీపీకి, చంద్రబాబు అరెస్టును వ్యతిరేకించేవర్గాలకు టార్గెట్‌ అయింది బీజేపీ. కేంద్రంలోని పెద్దల సహకారం లేకుండానే చంద్రబాబు స్థాయి వ్యక్తిని అరెస్టు చేస్తారా.. కేంద్రం ఇంటిలిజెన్స్ సమాచారం లేకుండా ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ సానుభూతిపరులు.

చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదంటున్నారు ఈ పార్టీ తెలంగాణ నేత విజయశాంతి. అరెస్టు తీరును ఇప్పటికే లక్ష్మణ్‌ వంటి సీనియర్లు ఖండించారన్నారు. అయితే జనసేన ఓపెన్‌గానే మద్దతు ప్రకటించి అండగా ఉన్నా.. బీజేపీ ఏపీ నేతల మౌనం టీడీపీలో అనుమానాలకు కారణమవుతోంది. రాజకీయంగా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

Published on: Sep 13, 2023 07:02 PM