MP Kesineni Nani: బాబు మేలు కోరుతూ రిషికేశ్‌లో కేశినేని నాని ప్రత్యేకంగా పూజలు

MP Kesineni Nani: బాబు మేలు కోరుతూ రిషికేశ్‌లో కేశినేని నాని ప్రత్యేకంగా పూజలు

Ram Naramaneni

|

Updated on: Sep 13, 2023 | 6:21 PM

చంద్రబాబు అక్రమ కేసులో అరెస్ట్ అయ్యారని.. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా పూజలు చేస్తున్నారు. తాజాగా చంద్రబాబుకు మంచి జరగాలని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఉత్తరాఖండ్‌లో యాగం నిర్వహించారు. చంద్రబాబుకు త్వరగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు నుంచి బయటపడాలని ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యం, పూర్ణాయుష్షుతో జీవించాలని కోరుకున్నట్లు ట్వీట్‌ చేశారు ఎంపీ కేశినేని నాని. చంద్రబాబుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయన్నారు. కాగా మొన్నామధ్య పార్టీ అధినాయకత్వానికి, కేశినేనికి కాస్త గ్యాప్ వచ్చిందన్న టాక్ నడిచింది. అందుకు తగ్గట్లుగానే.. నాని తమ్ముడు చిన్ని యాక్టివ్ అయ్యారు. బెజవాడ ఎంపీ టికెట్ సైతం ఆయనకే ఇస్తారన్న ప్రచారం జరిగింది. అయితే చిన్ని ప్రజంట్ మళ్లీ పార్టీలో యాక్టివ్ అవ్వడం చర్చనీయాంశమైంది.

స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు న్యాయపోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. కేసు కొట్టేయాలని చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ విచారణను హైకోర్టు వాయిదా వేయడంతో వచ్చే మంగళవారం వరకు ఆయన జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు తరపున న్యాయస్థానాల్లో వాదనలు వినిపిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్‌ లాయర్‌ సిద్ధార్థ్‌ లూథ్రా రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబును ఈ సాయంత్రం కలిశారు. దాదాపు 40 నిమిషాల పాటు ఆయన చంద్రబాబుతో ములాఖత్‌ అయ్యారు. ఆ తర్వాత ఆయన ఏం మాట్లాడకుండానే వెళ్లిపోయారు. మరో వైపు చంద్రబాబును రేపు బాలకృష్ణ, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కలిసే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వాళ్లు రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు రానున్నారు.