Konaseema: 'బాబు గారంటే ప్రాణం'.. అరెస్ట్‌కి నిరసనగా ఈ వృద్ధుడు గుడికి వెళ్లి ఏం చేశాడంటే..?

Konaseema: ‘బాబు గారంటే ప్రాణం’.. అరెస్ట్‌కి నిరసనగా ఈ వృద్ధుడు గుడికి వెళ్లి ఏం చేశాడంటే..?

Ram Naramaneni

|

Updated on: Sep 13, 2023 | 5:36 PM

చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ నేపథ్యంలో టీడీపీ శ్రేణుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఇటీ హైదరాబాద్ సైబర్ టవర్స్ వద్ద కూడా  కొందరు ఐటీ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే చంద్రబాబు జైలు నుండి విడుదలయ్యే వరకు ఇంటికి వెళ్లనని ఓ వృద్దుడు గుడిలో నిరాహారదీక్ష చేస్తున్నాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గుండేటిపూడి గ్రామంలో ఉండే 75 ఏండ్ల పోతల సత్యం, చంద్రబాబుని అరెస్ట్ చేయడం పట్ల తన బాధను వ్యక్తం చేశారు. చంద్రబాబు జైలు నుంచి ఇంటికి వస్తేనే..  తాను నిరాహారదీక్ష విరమించి వెళ్తానని, గ్రామ గుడిలో నిరాహారదీక్ష చేస్తున్నాడు. ఇది చూసి మరికొందరు గ్రామస్తులు సైతం ఆయనకు సంఘీభావం చెబుతూ దీక్షలో పాల్గొంటున్నారు. 

బుధవారం ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు సంబంధించి, ఇద్దరు న్యాయమూర్తుల ముందు రెండు వాదనలు జరిగాయి. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు తరఫు లాయర్లు వేసిన క్వాష్‌ పిటిషన్‌పై జస్టిస్‌ శ్రీనివాస్‌రెడ్డి బెంచ్‌ ముందు వాదనలు జరిగాయి. ఈ కేసులో రిమాండ్‌ను సస్పెండ్‌ చేయాలని, FIR కొట్టి వేయాలంటూ బాబు తరఫు లాయర్లు పిటిషన్‌ వేశారు. అయితే చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూధ్రా వాదనలు వినిపించాక, కౌంటర్‌ దాఖలుకు వారం టైమ్‌ కావాలని అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి అడిగారు. దీంతో వచ్చే మంగళవారానికి విచారణ వాయిదా పడింది. అప్పటిదాకా చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వొద్దంటూ కోర్టును లూధ్రా కోరారు. ఆయన విజ్ఞప్తికి కోర్టు సానుకూలంగా స్పందించింది.

ఇక జస్టిస్‌ సురేష్‌ రెడ్డి ధర్మాసనం ముందు…అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి బాబు లాయర్లు పిటిషన్‌ వేశారు. CID నమోదు చేసిన కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ కోరుతూ వాళ్లు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని CIDకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను ఈనెల 19కి హైకోర్టు వాయిదా వేసింది. సో..క్వాష్‌ పిటిషన్‌పై విచారణ, ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై విచారణ మళ్లీ ఒకే రోజు..అంటే ఈ నెల 19న జరగనున్నాయి. అంతవరకు చంద్రబాబు రాజమండ్రి జైల్లోనే ఉంటారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.