Bandi Sanjay: చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన బండి సంజయ్.. ఏమన్నారంటే
14 రోజుల రిమాండ్‌లో భాగంగా చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే పలు రాజకీయ పార్టీలు, నేతలు చంద్రబాబుకు మద్ధతు నిలుస్తున్నారు. చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అక్రమ అరెస్ట్ చేసిందంటూ బహిరంగానే చెబుతున్నారు. తాజాగా ఇదే విషయమై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సైతం స్పందించారు...
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం తాలుకూ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 14 రోజుల రిమాండ్‌లో భాగంగా చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే పలు రాజకీయ పార్టీలు, నేతలు చంద్రబాబుకు మద్ధతు నిలుస్తున్నారు. చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అక్రమ అరెస్ట్ చేసిందంటూ బహిరంగానే చెబుతున్నారు. తాజాగా ఇదే విషయమై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సైతం స్పందించారు. చంద్రబాబు పట్ల కక్షపూర్తిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని బండి ప్రశ్నించారు. ఏదైనా ఉంటే రాజకీయంగా కొట్లాడాలి కానీ ఇలా చేయడం వల్ల వైసీపీ వాళ్ల గోతిలో వాళ్లే పడ్డారనన్నారు. మరి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.