News Watch: బిగ్ డెసిషన్.. వెనక్కి తగ్గని అధికార, విపక్షాలు.. ఏం జరగనుంది..?

|

Jul 26, 2023 | 8:15 AM

మణిపూర్‌ హింసపై చర్చ విషయంలో పార్లమెంట్‌లో అధికార, విపక్షాలు వెనక్కి తగ్గడం లేదు. ప్రధాని స్వయంగా వచ్చి సభలో ప్రకటన చేయాలని సభలో విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో సంఖ్యాబలం తక్కువ ఉన్నప్పటికీ ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశపెట్టాలని నిర్ణయించాయి.

News Watch: బిగ్ డెసిషన్.. వెనక్కి తగ్గని అధికార, విపక్షాలు.. ఏం జరగనుంది..?
News Watch
Follow us on

మణిపూర్‌ హింసపై చర్చ విషయంలో పార్లమెంట్‌లో అధికార, విపక్షాలు వెనక్కి తగ్గడం లేదు. ప్రధాని స్వయంగా వచ్చి సభలో ప్రకటన చేయాలని సభలో విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో సంఖ్యాబలం తక్కువ ఉన్నప్పటికీ ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశపెట్టాలని నిర్ణయించాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన విపక్ష కూటమి ఇండియా సమావేశం జరిగింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా మణిపూర్‌ హింస సహ అనేక కీలక అంశాలపై చర్చించే అవకాశం లభిస్తుందని విపక్ష కూటమి భావిస్తోంది. అయితే, మణిపూర్‌ హింసపై చర్చకు సిద్ధమని చెప్తున్న ప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లులు ప్రవేశపెట్టి చర్చిస్తోంది. షెడ్యూల్డ్‌ కులాల ఆర్డర్‌కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుపై రాజ్యాంగ సభలో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టి, చర్చించి దాన్ని ఆమోదించింది.

న్యూస్ వాచ్ లైవ్ వీడియో..