News Watch: గులాబీ పార్టీలోకి వలసల జోరు… మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్
ఈ ఆట బీజేపీ సైడ్ నుంచే మొదలైంది. ముందుగా కాంగ్రెస్ కంచుకోటలో పాగావేసిన రాజును బీజేపీ తనవైపు లాక్కోవడం సక్సెస్ అయింది. తెలంగాణలో టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అన్న సంకేతాలు పంపింది.
ఈ ఆట బీజేపీ సైడ్ నుంచే మొదలైంది. ముందుగా కాంగ్రెస్ కంచుకోటలో పాగావేసిన రాజును బీజేపీ తనవైపు లాక్కోవడం సక్సెస్ అయింది. తెలంగాణలో టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అన్న సంకేతాలు పంపింది. వెంటనే బూరను తమవైపుకు తిప్పుకుంది. అధికార పార్టీని ఇంకాస్త టెన్షన్ ను పెట్టించింది. ఇంకా అధికార పార్టీలో అసంతృప్తులెవరున్నారో వారందరినీ తమవైపు తిప్పుకునే ప్రయత్నంలో ఉంది. ఇలా కీలక నేతలను తమవైపు తిప్పుకుని అధికార పార్టీ బలగాన్ని మరింత పలుచన చేద్దామనుకుంటున్న బీజేపీకి అంతకుమించిన షాకిచ్చింది గులాబీ దళం. కాంగ్రెస్‌పై అలకపూని..రీసెంట్‌గానే బీజేపీలో చేరిన దాసోజు శ్రవణ్‌ను తమ గ్రిప్‌లోకి తెచ్చుకుంది. అంతకుముందు తమ పార్టీలోనే ఉండి స్పీకర్‌గా చేసిన స్వామిగౌడ్‌నూ మళ్లీ తమవైపు తిప్పుకుంది. ఇది ఇంత షార్ట్ టైంలో ఇది తెలంగాణ రాజకీయమూ ఊహించని పరిణామమే. ఒకింత బీజేపీకి షాక్‌తో కూడా ఆశ్చర్యం గొలిపిన జంపింగ్స్ ఇవి. నెక్స్ట్ క్యూలో ఉన్నది బీజేపీ నేత జితేందర్ రెడ్డేనంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా..వెంటనే నేను బీజేపీలోనే ఉంటా…ఉన్నా..అంటూ ఆయనే స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో..ప్రస్తుతానికి జితేందర్ జంపింగ్‌పై ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడ్డాయి. చేరినవాళ్లంతా పార్టీకి ఇన్‌స్టంట్ విజయాలు తెచ్చిపెడతారా అన్నది కాదిక్కడ మేటర్….మేము తలుచుకుంటే ఎందాకైనా అన్న మెస్సేజ్‌ను ప్రత్యర్ధిగా బలంగా చెప్పడమే ఈ చేరికల వెనుకున్న రాజకీయ లక్ష్యం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
JR NTR: బ్రాండ్ అంటే.. ఇది సర్ !! ఒరిజినల్ అంతే..
జక్కన్న పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఏఆర్ రెహమాన్.. ఏంటంటే ??
Kantara: ఆ ఒక్క సీనే.. థియేటర్ దద్దరిల్లేలా చేస్తోంది..
Kajal Aggarwal: కాజల్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్.. నీల్‌ని ఉద్దేశిస్తూ
రెస్టారెంట్ కి వెళ్లిన జో బైడెన్ కు.. షాకిచ్చిన క్యాషియర్
డబ్బులు ఇచ్చే ఏటీఎం కాదు… ఇడ్లీలు ఇచ్చే ఏటీఎం.. చట్నీ, కారప్పొడితో