Minister KTR With Goreti Venkannaa Live: తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి హ్యాట్రిక్ విజయం కోసం పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. తెలంగాణ అభివృద్ధి గురించి చెబుతూనే.. విపక్షాలపై ఫైర్ అవుతోంది. ఓ వైపు సీఎం కేసీఆర్.. మరోవైపు మంత్రి కేటీఆర్.. తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ.. గులాబీ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో మంత్రి కేటీఆర్.. పలువురు ప్రముఖులతో వరుసగా భేటీ అవుతూ.. సీఎం కేసీఆర్ పాలన.. గతంలో ఉన్న పాలన గురించి.. ఆరా తీయడంతోపాటు.. పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చిస్తున్నారు. అంతకుముందు జయప్రకాష్ నారాయణ.. ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో భేటీ అయిన.. కేటీఆర్ తాజాగా.. గోరటి వెంకన్నతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నీళ్లు, పంటల గురించి మాట్లాడుతూనే.. పలు అంశాల గురించి చర్చించారు. మినిస్టర్ విత్ గోరటి వెంకన్న లైవ్ వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..