
Minister KTR Exclusive Interview With Jaya Prakash: తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్నాయి.. ఈ తరుణంలో అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ.. ప్రచారంలో దూసుకెళ్తోంది. షెడ్యూల్ రాకముందే.. అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. తొలి విడత ప్రచారాన్ని కూడా పూర్తి చేశారు. త్వరలోనే రెండో విడత ప్రచారానికి కూడా సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో కేసీఆర్ తనయుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు (కేటీఆర్) తనదైన శైలిలో ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తూ.. పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. అంతేకాకుండా.. ఎప్పటికప్పుడు.. మంత్రి హరీష్ రావుతో కలిసి బీఆర్ఎస్ క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తూ.. హ్యాట్రిక్ విజయం తమదేనంటూ ధీమా వ్యక్తంచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్ పార్టీనే గెలుస్తుందని.. హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుని.. సౌత్ లోనే రికార్డు సృష్టిస్తామంటూ పేర్కొంటున్నారు. ఈ తరుణంలో టీవీ9 ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలుగు మీడియా చరిత్రలోనే ఎవ్వరూ చేయని విధంగా.. ప్రముఖ వ్యక్తులతో ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. తాజాగా.. మంత్రి కేటీఆర్‌తో జయప్రకాశ్ నారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్.. 9 ఏళ్ల పాలనపై ఫీడ్ బ్యాక్ ఇవ్వాలంటూ జేపీని ప్రశ్నలడిగారు.. మంత్రి కేటీఆర్ ఎలాంటి ప్రశ్నలడిగారు.. జేపీ ఎలాంటి సమాధానాలు చెప్పారు.. అనేవి తెలుసుకునేందుకు.. కేటీఆర్ తో జేపీ కార్యక్రమాన్ని వీక్షించండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..