KTR: ‘డబ్బు, మద్యం పంచనంటున్నారు నిజమేనా..?’- కేటీఆర్ ఆన్సర్ ఇదే
సంపద పెంచాలె..ప్రజలకు పంచాలె. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకు సాగాలె. ఆడబిడ్డలకు అండగా నిలవాలె. ఇలా పలు అంశాలు బీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో ఉన్నాయి. బీఆర్‌ఎస్ మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా కేటీఆర్ టీవీ9 ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్: మీరు పదే, పదే.. సిరిసిల్లలో డబ్బులు పంచను.. మద్యం పోయించను అంటున్నారు..? అది సిరిసిల్లకు పరిమితమా…? మొత్తం రాష్ట్రానికా..?
మంత్రి కేటీఆర్: నేను అది ఓ కాంగ్రెస్ నాయకుడికి కౌంటర్‌గా మాట్లాడాను. నాకు ఆ కర్మ పట్టలేదు. రాజకీయాల్లో ప్రజలు ఉండాలనుకున్న రోజులు ఉంటాను. వ్యక్తిగతంగా నేను 4 ఎలక్షన్స్ పోరాడాను. ఇది 5వ ఎలక్షన్. ఇన్నిసార్లలో నేను ఒక్కసారి కూడా ఓటు కోసం ఒక్క రూపాయి కూడా పంచలేదు. ఒక్క మందు చుక్క పోయించలేదు. ఇది నా కమిట్‌మెంట్. ఇది కేసీఆర్ నుంచి నేర్చుకున్న క్వాలిటీ. ఓడిపోయినా పర్లేదు.. నేను ఈ పద్దతి మార్చుకోను.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..
Published on: Oct 15, 2023 08:07 PM
వైరల్ వీడియోలు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

