KTR: రేవంత్ ఛాలెంజ్‌కి టీవీ9 వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కేటీఆర్

Subhash Goud

|

Updated on: Oct 15, 2023 | 8:46 PM

మంత్రి కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. దయ్యాలు వేదాలు వళ్లించడం అంటే ఇదేనని, డబ్బు కట్టలతో దొరికిపోయిన వ్యక్తి రాష్ట్ర ప్రజలు మొత్తం చూశారని, అలాంటి వ్యక్తి ఇప్పుడు ఈ మాటలు మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు. గతంలో రేవంత్‌ రెడ్డి కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారని, మరి ఆ వ్యక్తి ఇప్పుడు ఉండటం దేనికని అన్నారు. ఒక స్థాయి ఉన్న వ్యక్తి అయితేనే మేము మాట్లాడుతాము.. ఇలాంటి వాళ్లతో ఎందుకు మాట్లాడుతామంటూ చురకలంటించారు..

రేవంత్ ఛాలెంజ్‌కి టీవీ9 వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్‌. ఎన్నికల్లో మద్యం, డబ్బు పంచకుండా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ద్వారానే ప్రజల్లోకి వెళ్తామంటూ అమర వీరుల స్థూపం వద్ద ప్రమాణం చేయాలని రేవంత్‌ రెడ్డి సీఎం కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. 17వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు అమర వీరు స్థూపం వద్దకు తాను వచ్చి ప్రమాణం చేస్తానని, కేసీఆర్‌ కూడా వచ్చిన ప్రమాణం చేయాలని సవాల్‌ విసిరారు.

దీనిపై మంత్రి కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. దయ్యాలు వేదాలు వళ్లించడం అంటే ఇదేనని, డబ్బు కట్టలతో దొరికిపోయిన వ్యక్తి రాష్ట్ర ప్రజలు మొత్తం చూశారని, అలాంటి వ్యక్తి ఇప్పుడు ఈ మాటలు మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు. గతంలో రేవంత్‌ రెడ్డి కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారని, మరి ఆ వ్యక్తి ఇప్పుడు ఉండటం దేనికని అన్నారు. ఒక స్థాయి ఉన్న వ్యక్తి అయితేనే మేము మాట్లాడుతాము.. ఇలాంటి వాళ్లతో ఎందుకు మాట్లాడుతామంటూ చురకలంటించారు.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Published on: Oct 15, 2023 08:30 PM