2 రోజుల్లోనే ఏం చేశారని మాట్లాడుతున్నారు.. 10 ఏళ్లు ఏం చేశారు: కోమటిరెడ్డి
తెలంగాణ సచివాలయంలో ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మొత్తం 9 ఫైళ్లపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. రానున్న 2 - 3 ఏళ్లలో రోడ్ల విస్తీర్ణానికి చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.
తెలంగాణ సచివాలయంలో ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మొత్తం 9 ఫైళ్లపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. రానున్న 2 – 3 ఏళ్లలో రోడ్ల విస్తీర్ణానికి చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. ఎన్నికల వేళ ఇచ్చిన 6 గ్యారంటీలను వీలైనంత త్వరగా అమలు చేస్తామన్నారు.
అటు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు సచివాలయానికి భారీగా తరలివచ్చారు. తమ అభిమాన నేతకు కంగ్రాట్స్ చెప్పారు. అనంతరం అర్ అండ్ బీ శాఖ అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఎంపీగా ఉన్నప్పుడే కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీతో మాట్లాడి రహదారుల అభివృద్ధికి కృషి చేశానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లోనే ఏం చేశారని హరీశ్‌రావు మాట్లాడుతున్నారని.. 10 ఏళ్లుగా బీఆర్‌ఎస్ నేతలు ఏం చేశారని కోమటిరెడ్డి ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో ఎవరి మీదా.. కావాలని కక్ష సాధింపులు ఉండవని… తప్పులు ఉంటే వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి.
విధి నిర్వహణలో ప్రాణాల్ని కూడా లెక్కచేయని ఆర్టీసీ డ్రైవర్
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి..
వారెవా.. లిటిల్ జీనియస్ రూబిక్ క్యూబ్ ఆర్ట్తో రికార్డులు
మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు

