Maldives vs Lakshadweep: కుర్చీ మడతెట్టకుండానే చైనాకు చెక్ పెట్టేసిన మోదీ.!

Maldives vs Lakshadweep: కుర్చీ మడతెట్టకుండానే చైనాకు చెక్ పెట్టేసిన మోదీ.!

Anil kumar poka

|

Updated on: Jan 12, 2024 | 9:40 AM

ఇక్కడ చిటికేస్తే.. అక్కడ మన శత్రువు వెన్నులో వణుకు పుట్టాలి. ఇది నరేంద్ర మోదీ స్ట్రాటజీ. కొన్ని విషయాల్లో మౌనం. మరికొన్ని విషయాల్లో దూకుడు. ఇంకొన్ని విషయాల్లో సంయమనం. ఇలా సమయం, సందర్భం బట్టి మోదీ.. ఆ మ్యాటర్ ను డీల్ చేసే స్టైల్ మారుతుంది. ఆయన స్ట్రాటజీ ఇంప్లిమెంట్ అవుతుంది. ప్రధాని మోదీ లక్షద్వీప్ టూర్ లోనూ ఇవే ఉన్నాయి. 24*7, 365 డేస్.. రెస్ట్ లేకుండా, బ్రేక్ తీసుకోకుండా పరిపాలనలో బిజీబిజీగా ఉండే ప్రధాని నరేంద్రమోదీ..

ఇక్కడ చిటికేస్తే.. అక్కడ మన శత్రువు వెన్నులో వణుకు పుట్టాలి. ఇది నరేంద్ర మోదీ స్ట్రాటజీ. కొన్ని విషయాల్లో మౌనం. మరికొన్ని విషయాల్లో దూకుడు. ఇంకొన్ని విషయాల్లో సంయమనం. ఇలా సమయం, సందర్భం బట్టి మోదీ… ఆ మ్యాటర్ ను డీల్ చేసే స్టైల్ మారుతుంది. ఆయన స్ట్రాటజీ ఇంప్లిమెంట్ అవుతుంది. ప్రధాని మోదీ లక్షద్వీప్ టూర్ లోనూ ఇవే ఉన్నాయి. 24*7, 365 డేస్.. రెస్ట్ లేకుండా, బ్రేక్ తీసుకోకుండా పరిపాలనలో బిజీబిజీగా ఉండే ప్రధాని నరేంద్రమోదీ… లక్షద్వీప్ కు వెళ్లి అలా కాసేపు సేదతీరారు అనేసరికీ అంతా ఆశ్చర్యపోయారు. కొంతమంది మేధావులు మాత్రం దీని వెనుక ఏదో ప్లాన్ ఉండే ఉంటుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది.. మోదీ లక్షద్వీప్ టూర్ అంత ఆషామాషీగా సాగింది కాదు అని. ఎందుకంటే దీని వెనుక చైనాకు చెక్ పెట్టే పెద్ద వ్యూహముంది. డ్రాగన్ తోక జాడిస్తే.. కట్ చేసే ప్లానుంది. దానికి వేదికే నైన్ డిగ్రీ ఛానల్.

అసలేంటీ నైన్ డిగ్రీ ఛానల్? దీనికి ఆన్సర్ చాలా సింపుల్. హిందూ మహాసముద్రంలో ఉన్న ఓ సముద్ర మార్గం ఇది. భూమధ్యరేఖకు ఉత్తరాన 9 డిగ్రీల అక్షాంశ రేఖపై ఉన్నందు వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఆసియాలో.. ఆమాటకొస్తే.. ప్రపంచ వాణిజ్యానికి ఇది చాలా అంటే చాలా కీలకమైన జల రవాణా మార్గం. ఇక్కడ విలువైన ఉత్పత్తులతో చాలా ఓడలు నిరంతరం ప్రయాణిస్తుంటాయి. ఈ రూట్ చాలా బిజీగా ఉంటుంది. ఈ మార్గం అరేబియా సముద్రంలోని సౌత్ వెస్ట్ కు, బంగాళాఖాతం లోని నార్త్ ఈస్ట్ కు కనెక్ట్ అవుతుంది. మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే.. ఒక్క నెంబర్ చెబుతాను. అది నెంబర్ 11. అంటే.. ఒక నిమిషానికి ఈ రూట్లో వెళ్లే ఓడల సంఖ్య ఇది. సో.. గంటకు 660 ఓడలు.. రోజుకు దాదాపు 16 వేల ఓడలు ప్రయాణిస్తాయి. దీనిని బట్టి ఈ రూట్ ఎంత బిజీగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఈ జలరవాణా మార్గం.. మన ప్రాదేశిక జలాల మీదుగా వెళుతోంది. ఇదీ అసలు పాయింట్. ఈ పాయింట్ ను బేస్ చేసుకుని డ్రాగన్ కు కావాలంటే ఝలక్ ఇవ్వచ్చు. కానీ మన జోలికి వచ్చేవరకు మనం ఎవరి జోలికి వెళ్లం. అందుకే చైనా ఇప్పుడు జస్ట్ మన టీజర్ ను మాత్రమే చూసింది.

హిందూ మహాసముద్రంలో ఉన్న ఈ జలరవాణా మార్గం.. అక్కడున్న లక్షద్వీప్ లోని రెండు దీవులను వేరు చేస్తుంది… అవే కాల్పెనీ, మినికోయ్. ఐరోపా, పశ్చిమాసియా, ఆఫ్రికా నుంచి… మన దేశంతోపాటు చైనా, దక్షిణాసియా, ఆగ్నేయాసియాకు వచ్చే ఓడలకు ఈ మార్గమే ఆధారం. అలాంటి ఈ రూట్.. మన ప్రాదేశిక జలాల మీదుగా వెళుతుంది. ఇక్కడ కాని ఓడలను అడ్డుకుంటే.. ప్రపంచంలో దేశాలన్నీ షాక్ అవుతాయి. వాటి ఆర్థిక వ్యవస్థలు షేక్ అవుతాయి. ఇంకో మాటలో చెప్పాలంటే.. కుప్పకూలిపోతాయి. మోదీ లక్షద్వీప్ టూర్ తో ఇప్పటికే చైనాకు ఆ విషయం అర్థమై ఉంటుంది. కేంద్రం కూడా మినికోయ్ దీవులను రక్షణ స్థావరంగా విస్తరించాలన్న ప్లాన్ తో ఉంది. ఒకవేళ అదే జరిగితే.. ఆ ప్రాంతంపై మనకు ఫుల్ కంట్రోల్ ఉంటుంది. ఆధిపత్యాన్నీ ఇస్తుంది. ఒకవేళ చైనా కానీ ఎప్పుడైనా వీరావేశంతో విరుచుకుపడితే.. తీవ్రస్థాయిలో ఘర్షణలు చోటుచేసుకుంటే.. సింపుల్ గా ఈ మార్గాన్ని మూసేయచ్చు. అదే జరిగితే.. డ్రాగన్ ఆర్థిక కార్యకలాపాలకు బ్రేక్ పడుతుంది. ఆ విషయం చైనాకు తెలుసు. అందుకే మాల్దీవుల వ్యవహారంపై ఆచితూచి అడుగులు వేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos