Lok Sabha Elections 2024: ప్రధాని మోదీపై పోటీ చేస్తున్న ట్రాన్స్‌జెండ‌ర్.! ఎవ‌రీ హేమాంగి స‌ఖి మాత.!

ప్ర‌ధాని నరేంద్ర‌ మోదీ వార‌ణాసి నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోక్‌స‌భకు పోటీ చేస్తున్నారు. ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న‌పై ఓ ట్రాన్స్‌జెండ‌ర్ కూడా పోటీ చేస్తుండ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. అఖిల భార‌త హిందూ మ‌హాస‌భ కు చెందిన హేమాంగి స‌ఖి మాత బ‌రిలో నిలిచారు. గుజ‌రాత్ రాష్ట్రం బ‌రోడాలో జ‌న్మించిన ఆమె ప్ర‌పంచంలోనే భ‌గ‌వ‌ద్గీత‌ను బోధిస్తున్న మొట్ట‌మొద‌టి ట్రాన్స్‌జెండ‌ర్ కావ‌డం విశేషం.

Lok Sabha Elections 2024: ప్రధాని మోదీపై పోటీ చేస్తున్న ట్రాన్స్‌జెండ‌ర్.! ఎవ‌రీ హేమాంగి స‌ఖి మాత.!

|

Updated on: Apr 10, 2024 | 10:38 AM

ప్ర‌ధాని నరేంద్ర‌ మోదీ వార‌ణాసి నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోక్‌స‌భకు పోటీ చేస్తున్నారు. ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న‌పై ఓ ట్రాన్స్‌జెండ‌ర్ కూడా పోటీ చేస్తుండ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. అఖిల భార‌త హిందూ మ‌హాస‌భ కు చెందిన హేమాంగి స‌ఖి మాత బ‌రిలో నిలిచారు. గుజ‌రాత్ రాష్ట్రం బ‌రోడాలో జ‌న్మించిన ఆమె ప్ర‌పంచంలోనే భ‌గ‌వ‌ద్గీత‌ను బోధిస్తున్న మొట్ట‌మొద‌టి ట్రాన్స్‌జెండ‌ర్ కావ‌డం విశేషం. 2019లో ఆమె ఆచార్య మ‌హామండ‌లేశ్వ‌ర్‌గా ప‌ట్టాభిషిక్తుల‌య్యారు. ఆమె తండ్రి ఓ ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్ కావ‌డంతో చిన్నతనంలో వారి కుటుంబం ముంబైకి మకాం మార్చింది. గొప్ప ఆధ్యాత్మికపరురాలిగా ఉన్న‌ ఆమె.. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీపైనే పోటీకి దిగడం ఆసక్తికరంగా మారింది.

ఇక ఇప్పటివ‌ర‌కు రెండు ఎన్నికల్లోనూ నరేంద్ర మోదీకి ప్రధాన పోటీదారులుగా ఉన్న ఆప్ లేదా ఎస్‌పీ.. సెక్యులర్ భావజాలంతో ముందుకు సాగిన వారే. హిందూత్వ అన్న నినాదంతో బీజేపీ పోటీ చేసేది. ఇప్పుడు హిందూ మహాసభ.. బీజేపీకి పోటీగా అభ్యర్ధిని పెట్టడం, అందులోనూ హేమాంగి సఖి మాతని పోటీకి నిలిపింది. దీంతో ఇది అందరి దృష్టినీ ఆకర్షించింది. బీజేపీ భావజాలంతోనే హిందూ మహాసభ ఉన్నా.. ప్రధాని మోదీపైనే పోటీగా ఎందుకు నిలబెట్టిందీ అన్నది పెద్ద ప్రశ్న. ఏది ఏమైనా ఎవరీ హేమాంగ్ సఖి మాత అని నెటిజన్లు ఇపుడు ఆమె కోసం తెగ‌ సెర్చ్ చేస్తున్నారు. దేశంలోనే బలమైన నేతగా ఉన్న మోదీని ఢీ కొనడం అంటే ఆషామాషీ కాదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us