KTR Power Point Presentation: తెలంగాణ రాజకీయాలు శ్వేత పత్రం వర్సస్ స్వేద పత్రంగా మారాయి. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ అప్పుల కుప్పగా మార్చేసిందంటూ..అసెంబ్లీలో శ్వేతపత్రంతో ప్రతిపక్షంపై విరుచుకు పడింది అధికార పక్షం. అయితే అందులో ఉన్న లెక్కలన్నీ తప్పుడు లెక్కలని కొట్టి పారేసిన ప్రతిపక్షం..అసెంబ్లీలోనే కౌంటర్ ఇచ్చింది. అదే క్రమంలో తన పాలనలోని ప్రగతిని స్వేదపత్రం పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించాలని నిర్ణయించింది.. బీఆర్‌ఎస్.. బీఆర్ఎస్ సర్కారు హయాంలో తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని స్వేదపత్రం పేరుతో మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటెషన్ ఇస్తున్నారు. తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం..దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయంటూ కేటీఆర్ పేర్కొన్నారు. పగలూ రాత్రి తేడా లేకుండా.. రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను..దెబ్బతీస్తే సహించమని హెచ్చరించారు. అందుకే గణాంకాలతో సహా..వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరించేందుకు, అప్పులు కాదు..తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు..స్వేద పత్రం రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై మూడు రోజుల పాటు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఇతర నేతలు విస్తృతస్థాయిలో చర్చలు జరిపి, సమాచారాన్ని సేకరించి, దానిని స్వేదపత్రంలో పొందుపరిచారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..