Hyderabad: భాగ్యలక్ష్మి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణ ప్రభుత్వం తరపున భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్రంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు తెలిపారు. ఓల్డ్ సిటీ నీ న్యూ సిటీ గా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.
నగరం బోనమెత్తింది. అమ్మవారికి హైదరాబాద్ ఆడపడుచులు బోనాలు సమర్పించుకుంటున్నారు. నగరంలో 23 ప్రధాన ఆలయాల్లో బోనాలు సమర్పిస్తున్నారు. లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించేందుకు పెద్ద ఎత్తున మహిళలు తరలివస్తున్నారు. బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సింహవాహిని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
నంతరం మీడియాతో మాట్లాడుతూ.. మేడిగడ్డ కుంగినప్పుడు బీఆర్‌ఎస్ పార్టీయే అధికారంలో ఉందని గుర్తు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. NDSA నివేదికను త్వరలో బయటపెడతామన్నారాయన. కేటీఆర్ ఆరోపించినట్లు కుట్రలు చేస్తే డ్యామ్ లోపలికి ఎలా కుంగుతుందని ప్రశ్నించారు. పోటీ చేసిన సగం సీట్లలో డిపాజిట్లు రాని ఆ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు కోమటిరెడ్డి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

