సీఎం రేవంత్‌కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
తెలంగాణ గడ్డ మీద సవాళ్ల రాజకీయం నడుస్తోంది. సీఎం రేవంత్‌కు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. బీజేపీ చేసిన అభివృద్ధిపై సీఎం రేవంత్‌కు మాట్లాడే దమ్ము, ధైర్యం ఉందా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ చేసిన అభివృద్దిపై చర్చకు తాను సిద్ధం అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న దశాబ్దం పాటు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఏ విధమైన పథకాలు తీసుకొచ్చారు, తెలంగాణకు ఏమిచ్చారో చెప్పాలన్నారు.
తెలంగాణ గడ్డ మీద సవాళ్ల రాజకీయం నడుస్తోంది. సీఎం రేవంత్‌కు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. బీజేపీ చేసిన అభివృద్ధిపై సీఎం రేవంత్‌కు మాట్లాడే దమ్ము, ధైర్యం ఉందా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ చేసిన అభివృద్దిపై చర్చకు తాను సిద్ధం అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న దశాబ్దం పాటు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఏ విధమైన పథకాలు తీసుకొచ్చారు, తెలంగాణకు ఏమిచ్చారో చెప్పాలన్నారు. బీజేపీ అధికారంలోకివచ్చి మోదీ ప్రధాని కాగానే ఈ దశాబ్దకాలంలో తెలంగాణ ఎలా అభివృద్ది చేశామో బహిరంగ చర్చకు తాను సిద్దమన్నారు. అది రోడ్ల అభివృద్ది, రైల్వే నెట్వర్క్, రైతుల అభివృద్ది, సంక్షేమ పథకాలు ఇలా ఏ విషయంలోనైనా కాంగ్రెస్ హయాంలో తెలంగాణకు ఏమి వచ్చింది.. బీజేపీ హయాంలో ఏమి చేశామో చూపించేందకు సిద్దం అన్నారు. సీఎం రేవంత్ సిద్ధమా అని కిషన్‌రెడ్డి ఛాలెంజ్ విసిరారు. ఈరోజు కాంగ్రెస్ హస్తం గుర్తు మార్చేసి గాడిద గుడ్డు గుర్తు పెట్టుకున్నట్టు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తన గుర్తును మార్చుకుందేమో.. గాడిద గుడ్డును ఎన్నికల గుర్తుగా పెట్టుకుందేమో అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని సెటైర్లు వేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…