Suresh Gopi: 32 ఏళ్లుగా నటుడు సురేష్ గోపి క్షోభ.. ఈసారి రిలీఫ్.!
గెలుపోటములు సాధారణం.. సినిమాల్లో హీరోగా గెలుపునే కానీ ఓటమిని చూడని మళయాళ నటుడు సురేష్ గోపీ. కానీ రాజకీయాలలో ఓటములు పలకరించినా మళ్లీ మళ్లీ పోటీ చేసి గెలవాలన్న పట్టుదల మాత్రం వీడలేదు. కొన్ని విజయాలు చరిత్రనే తిరగరాస్తాయి. గుండెలోని భారం కొంతైనా దిగుతుందేమో! కూతురిపై పెట్టుకున్న బెంగ కాస్తయినా తగ్గుతుందేమో! 1992 జూన్ 6న భార్యాబిడ్డతో ప్రయాణిస్తున్న అతడి కారు రోడ్డు ప్రమాదానికి గురైంది.
గెలుపోటములు సాధారణం.. సినిమాల్లో హీరోగా గెలుపునే కానీ ఓటమిని చూడని మళయాళ నటుడు సురేష్ గోపీ. కానీ రాజకీయాలలో ఓటములు పలకరించినా మళ్లీ మళ్లీ పోటీ చేసి గెలవాలన్న పట్టుదల మాత్రం వీడలేదు. కొన్ని విజయాలు చరిత్రనే తిరగరాస్తాయి. గుండెలోని భారం కొంతైనా దిగుతుందేమో! కూతురిపై పెట్టుకున్న బెంగ కాస్తయినా తగ్గుతుందేమో! 1992 జూన్ 6న భార్యాబిడ్డతో ప్రయాణిస్తున్న అతడి కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. స్పృహలోకి వచ్చేసరికి ఆస్పత్రి బెడ్ మీద ఉన్నాడు. కళ్లు తెరుస్తూనే కంటతడి పెట్టుకున్నాడు. నా ప్రాణం కాపాడు స్వామీ అంటూ దేవుడికి మొక్కుకున్నాడు. ఇక్కడ తన ప్రాణం అంటే తన కూతురు లక్ష్మి.
గాయాలు బాధిస్తున్నా ఎలాగోలా సత్తువ కూడదీసుకుని ఏడాదిన్నర వయసున్న కూతురిని చూసేందుకు ఐసీయూలోకి వెళ్లాడు. కొనప్రాణంతో కూతుర్ని చూసి తల్లడిల్లిపోయాడు. అతడి కన్నీరు చూసి భగవంతుడు చలించలేదు. ఆమెను తీసుకెళ్లిపోయాడు. అందుకే జూన్ మాసం అంటేనే ఆయనకు భయం, అయిష్టత! ఈ నెలలో వర్షాలు పడి వాతావరణం మారే సమయంలో తన గాయాలు గుర్తొస్తాయట.
అయినా ఆ నొప్పిని భరించడం తనకిష్టమేనంటాడు సురేష్ గోపి. నలుగురు పిల్లలున్నా సరే లక్ష్మి లేని లోటును ఎవరూ పూడ్చలేడంటాడు. విధి ఎంత విచిత్రమో కదా! జూన్ నెలలో అతడి కూతుర్ని తీసుకెళ్లిపోయింది. సరిగ్గా 32 ఏళ్ల తర్వాత ఇదే నెలలో అతడికి ఊహించని విజయాన్ని అందించింది. సురేశ్ గోపి 2016లో రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ అయ్యాడు. తర్వాత బీజేపీలో చేరి 2019లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి మూడో స్థానానికే పరిమితమయ్యాడు. 2021 కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్‌లో పోటీ చేసినా విజయం వరించలేదు. నిరాశతో వెనుదిరగలేదు. ముచ్చటగా మూడోసారి పోటీ చేసి త్రిసూర్ ఎంపీగా గెలిచాడు. నటుడిగా వందల సినిమాలు చేసిన సురేశ్ గోపి తెలుగులో మూడు చిత్రాలలో మెప్పించాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.