Pawan Kalyan: జగన్ సర్కార్ పై పవన్ ఫైర్.. చొక్కాలు పట్టుకుని నిలదీస్తాం అంటూ..

|

Aug 11, 2023 | 8:05 AM

విశాఖలో వారాహి విజయయాత్ర ఫీవర్ మొదలైంది. జనసేన అధినేత పవన్‌కల్యాన్‌ ఫోకస్‌ ఇప్పుడు ఉత్తరాంధ్రపై పడింది. ఇవాళ్టి నుంచి 10 రోజుల పాటు ఆయన వారాహియాత్రను ఉత్తరాంధ్రలో చేపడుతున్నారు. నిన్న సాయంత్రం వైజాగ్ జగదాంబ సెంటర్‌ నుంచి జనసేన వారాహి విజయాత్ర మూడో విడద మొదలైయ్యింది. జగదాంబ జంక్షన్‌లో ఏర్పాటు చేసే సభలో పవన్ ప్రసంగించారు .

విశాఖలో వారాహి విజయయాత్ర ఫీవర్ మొదలైంది. జనసేన అధినేత పవన్‌కల్యాన్‌ ఫోకస్‌ ఇప్పుడు ఉత్తరాంధ్రపై పడింది. ఇవాళ్టి నుంచి 10 రోజుల పాటు ఆయన వారాహియాత్రను ఉత్తరాంధ్రలో చేపడుతున్నారు. నిన్న సాయంత్రం వైజాగ్ జగదాంబ సెంటర్‌ నుంచి జనసేన వారాహి విజయాత్ర మూడో విడద మొదలైయ్యింది. జగదాంబ జంక్షన్‌లో ఏర్పాటు చేసే సభలో పవన్ ప్రసంగించారు . ఆ తర్వాత జనవాణి కార్యక్రమం, క్షేత్రస్థాయి పర్యటనల కోసం ఉత్తరాంధ్రలో 10 రోజులపాటు పర్యటిస్తారు పవన్‌. ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాలను సందర్శిస్తారు.అయితే యాత్రకు పోలీసులు ఆంక్షలు విధించారు. ముందుగా నిర్ణయించిన దారిలో కాకుండా మరో దారిలో వెల్లాలని సూచించారు. ఎక్కడా రోడ్‌షోలు నిర్వహించడానికి వీల్లేదన్నారు. అయితే ఈ సాయంత్రం జగదాంబ కూడలిలో జరిగే సభకు మాత్రం పోలీసులు అనుమతి ఇచ్చారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఉత్తరాంధ్రలో పలు ప్రాంతాలను సందర్శిస్తారు పవన్‌కల్యాన్‌. స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టు కార్మికుల పోరాటానికి మద్దతు తెలుపనున్నారు. వారాహి యాత్రను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీలు నియమించింది జనసేన పార్టీ. మాజీ మంత్రి పడాల అరుణ జనసేనలో చేరారు. జనసేన ఆశయాలు అర్ధం చేసుకుని వచ్చేవారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తామన్నారు పవన్‌కల్యాన్‌.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...