Watch Video: తిరుపతిలో జనసేన నాయకుల ఆందోళన.. అసలు కారణం ఇదే..

|

Jul 04, 2024 | 12:09 PM

తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి ఎదుట జనసేన కార్యకర్తలు ఆందోళన చేశారు. జనసేన నేత కిరణ్ రాయల్‎తో కలిసి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి తన ఇంటి వాస్తు కోసం గత ప్రభుత్వ హయాంలో బుగ్గమఠం భూములను ఆక్రమిచారని ఆరోపించారు. ఆ భూముల్లో మున్సిపాలిటీ నిధులతో అక్రమంగా రోడ్డు వేసుకున్నారని కిరణ్‌ అన్నారు. వెంటనే ప్రభుత్వ అధికారులు అక్రమ రోడ్డుతోపాటూ గేట్ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే వాటిని తొలగించాలని ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.

తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి ఎదుట జనసేన కార్యకర్తలు ఆందోళన చేశారు. జనసేన నేత కిరణ్ రాయల్‎తో కలిసి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి తన ఇంటి వాస్తు కోసం గత ప్రభుత్వ హయాంలో బుగ్గమఠం భూములను ఆక్రమిచారని ఆరోపించారు. ఆ భూముల్లో మున్సిపాలిటీ నిధులతో అక్రమంగా రోడ్డు వేసుకున్నారని కిరణ్‌ అన్నారు. వెంటనే ప్రభుత్వ అధికారులు అక్రమ రోడ్డుతోపాటూ గేట్ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే వాటిని తొలగించాలని ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు తమను అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు కిరణ్ రాయల్.

దీంతో ఈ సమస్యను మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఆయన దీనిపై స్పందిస్తూ ఈ సమస్యను పరిష్కరించడానికి 2 రోజుల సమయం కావాలని కోరినట్లు తెలిపారు. 48 గంటల్లో సమస్య పరిష్కరించకపోతే ఈ సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. దీనిపై మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ రెండు రోజుల్లో ప్రభుత్వ రికార్డులు పరిశీలించి సమస్య పరిష్కరిస్తామని తిరుపతి జనసేన నాయకులకు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…