Chandrababu First Sign: సీఎంగా చంద్రబాబు తొలి సంతకం ఆ ఫైలు మీదేనా.?

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు జెట్‌ స్పీడ్‌తో పూర్తవుతున్నాయి. గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఉన్న కేసరపల్లి ఐటీపార్క్ వద్ద జూన్ 12న ఉదయం 11 గంటల 27 నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరికొందరు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. అయితే సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేసిన తర్వాత ఏ ఫైల్ మీద తొలి సంతకం చేస్తారనే అంశం ఆసక్తిగా మారింది.

Chandrababu First Sign: సీఎంగా చంద్రబాబు తొలి సంతకం ఆ ఫైలు మీదేనా.?

|

Updated on: Jun 11, 2024 | 12:12 PM

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు జెట్‌ స్పీడ్‌తో పూర్తవుతున్నాయి. గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఉన్న కేసరపల్లి ఐటీపార్క్ వద్ద జూన్ 12న ఉదయం 11 గంటల 27 నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరికొందరు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. అయితే సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేసిన తర్వాత ఏ ఫైల్ మీద తొలి సంతకం చేస్తారనే అంశం ఆసక్తిగా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు ప్రకటించిన మేరకు మూడు ఫైళ్ల మీద చంద్రబాబు సంతకాలు చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైలుపై చేసే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలోనే చంద్రబాబు ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటించారు. వైసీపీ మెగా డీఎస్సీ అంటూ మోసం చేసిందని.. తాము అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే ఉంటుందని చెప్పారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు మొదటి సంతకం మెగా డీఎస్సీ ఫైలుపైనే ఉండొచ్చు. ఇక ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం పెట్టే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కూడా టీడీపీ అధినేత అనేక బహిరంగ సభలలో ప్రకటించారు. పేదల భూములు లాక్కునేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వైసీపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చిందంటూ అప్పట్లో విమర్శించారు. మరో కీలకమైన ఎన్నికల హామీ ఫించన్ల పెంపు. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పింఛన్ ను నాలుగు వేలకు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో కూటమి హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పింఛన్లు పెంపుపై చంద్రబాబు మూడో సంతకం చేసే అవకాశం ఉన్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us