Chandrababu Naidu: పుంగనూరులో ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగం
టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో రణరంగంగా మారింది చిత్తూరుజిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం. సొంతజిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు విపక్షనేత చంద్రబాబు. అయితే ఆయన అడుగుపెట్టినప్పటినుంచీ వైసీపీ శ్రేణులు నిరసనలకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది.
టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో రణరంగంగా మారింది చిత్తూరుజిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం. సొంతజిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు విపక్షనేత చంద్రబాబు. అయితే ఆయన అడుగుపెట్టినప్పటినుంచీ వైసీపీ శ్రేణులు నిరసనలకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. అటు టీడీపీ కేడర్ కూడా ప్రతిఘటించటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరస్పరం రాళ్లదాడులే కాకుండా కొన్ని వాహనాలకు నిప్పుపెట్టారు. రెండువర్గాలను చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేసిన పోలీసులు పరిస్థితి అదుపు తప్పటంతో టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఓ దశలో గాల్లోకి కాల్పులు జరిపారు. ప్రస్తుతం పుంగనూరులో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పిరికిపందల్లా దాక్కోవడం కాదు దమ్ముంటే డైరెక్ట్‌గా తలపడాలని మంత్రి పెద్దిరెడ్డికి సవాల్ చేశారు చంద్రబాబు. ఇరువర్గాల ఘర్షణలో కొందరికి గాయాలైనట్లు సమాచారం ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan: ఆ ఒక్క విషయంలో పవన్ చాలా గ్రేట్ అబ్బా…
Hukum Song: టాలీవుడ్ పై స్టార్ హీరోల మూకుమ్మడి హుకుం
Bro Movie: అనుకుంటే.. పాతాళానికి పడేస్తా’ అంబటికి.. బ్రో ప్రొడ్యూసర్.. స్ట్రాంగ్ వార్నింగ్
Bro The Avatar: దిమ్మతిరిగే లాభం బ్రేక్ ఈవెన్‌ను దాటేసిన బ్రో
