తెలంగాణ శాసనసభ ఎన్నికల వేళ హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో జరిగిన బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పవన్‌కు మోదీ షేక్‌హ్యాండిచ్చారు. పక్కపక్కనే కూర్చున్న ఇద్దరు నేతలూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. తన ప్రసంగంలో ప్రధాని మోదీని ఆకాశానికెత్తేశారు పవన్. మోదీ ఎప్పుడూ దేశ ప్రయోజనాల కోసమే పనిచేస్తారు తప్ప.. ఎన్నికల ప్రయోజనాల కోసం కాదన్నారు పవన్. ప్రతి భారతీయుడి గుండెల్లో ప్రధాని మోదీ ధైర్యం నింపారని కొనియాడారాయన. తనలాంటి కోట్ల మంది కలలకు ప్రతిరూపమే నరేంద్ర మోదీ అన్నారు పవన్. మోదీ మరోసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు పవన్. పొత్తులో భాగంగా జనసేనకు బీజేపీ మొత్తం 8 స్థానాలు కేటాయించింది. జనసేనతో పొత్తు బీజేపీకి ఏమేరకు లాభిస్తుందో చూడాలి.
ఇదిలాఉంటే.. తెలంగాణలో జనసేన బీజేపీతో పొత్తు.. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశంతో పొత్తు.. ఈ క్రమంలో ఏపీలో బీజేపీతో పొత్తు మాటేంటి..? బీజేపీతో జనసేన, టీడీపీ ప్రయాణం చేస్తాయా..? లేదా..? అనేది చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..