Congress: రేవంత్ సీఎం అంటూ కాంగ్రెస్‌లో రచ్చ.. మాజీ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు..

|

Oct 28, 2023 | 9:16 PM

DK Shiva Kumar: కాంగ్రెస్ లో ఇప్పటికే టికెట్ల వివాదం, అసమ్మతి నేతల ఆందోళనలు కొనసాగుతుండగా తాజాగా మరో వివాదం మొదలైంది. తాండూరులో జరిగిన కాంగ్రెస్ సభలో డీకే శివకుమార్ ప్రసంగానికి రామ్మోహన్ రెడ్డి చేసిన అనువాదం కొత్త వివాదానికి తెరలేపింది. డీకే అనని మాటలను రామ్మోహన్ రెడ్డి అనువాదించడం పార్టీలో చర్చానీయాంశంగా మారింది.

తాండూరు కాంగ్రెస్ ప్రచార కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ.. ‘డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలపై సంతకం చేస్తుందని’ అన్నారు. దీనికి అనువాదంగా సోనియా పుట్టిన రోజున కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు, సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేస్తారని ఒకటికి మూడుసార్లు రామ్మోహన్ అన్నారు. ఆయన అనువాదం తప్పుగా చెబుతున్నా కూడా రేవంత్ రెడ్డి వారించలేదు.

మరోవైపు తాండూరు బస్సు యాత్రలో డీకే శివకుమార్‌తో కేవలం రేవంత్‌ రెడ్డి మాత్రమే కనిపించడం.. మిగతా రాష్ట్ర అగ్రనేతలు ఎవ్వరూ లేకపోవడం గమనార్హం. మిగతా లీడర్లు లేని సమయంలో కావాలనే రామ్మోహన్‌తో రేవంత్ ఇలా పలికించారా? ఒకటికి రెండుసార్లు తప్పుగా అనువదిస్తున్నా ఎందుకు ఆపలేదు? లేదంటే రామ్మోహనే అత్యత్సాహంతో రేవంత్‌ని సీఎం అన్నారా? ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కాస్తా పార్టీ నేతల్లో కొత్త చర్చకు దారి తీశాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..