Watch Video: తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..

|

Apr 27, 2024 | 4:33 PM

తెలంగాణలో కరెంట్ కోతలపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఒక ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయన్నారు. తాను గంట క్రితం మహబూబ్ నగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు తెలిపారు. ప్రచారం అనంతరం ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేశామన్నారు.

తెలంగాణలో కరెంట్ కోతలపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఒక ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయన్నారు. తాను గంట క్రితం మహబూబ్ నగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు తెలిపారు. ప్రచారం అనంతరం ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేశామన్నారు. భోజనానికి కర్చున్న మొదలు తినే వరకు రెండు సార్లు కరెంట్ పోయినట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఇదిలా ఉంటే ప్రతి రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కరెంట్ పోవడం లేదని ఊదరగొడుతున్నారని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. తనతోపాటు ఉన్న మాజీ శాసనసభ్యులు కరెంట్ కోతలపై చర్చించారు. తమ నియోజకవర్గాల్లో రోజుకు 10సార్లు కరెంటు పోతోందని ఈ సందర్భంగా కేసీఆర్ కు వివరించినట్లు తెలిపారు. దీనిపై కేసీఆర్ స్పందించారు. కాంగ్రెస్ పరిపాలనపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుందన్నారు. ఈ సమస్యపై రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలని కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published on: Apr 27, 2024 04:32 PM