Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi LIVE: ఢిల్లీలో దోచుకున్న సంపదను తిరిగి రప్పిస్తా.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..

PM Modi LIVE: ఢిల్లీలో దోచుకున్న సంపదను తిరిగి రప్పిస్తా.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..

Shaik Madar Saheb

|

Updated on: Feb 08, 2025 | 7:34 PM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం అనంతరం ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి.. విజయోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా తదితర అగ్రనేతలు హాజరయ్యారు.. ప్రధాని మోదీని కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.. భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు కేంద్ర కార్యాలయం వద్దకు చేరుకున్నారు. లైవ్ లో చూడండి..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అపూర్వ విజయం సాధించింది.. దీంతో కాషాయపార్టీ నేతల సంబరాలు అంబరాన్నంటాయి.. ఢిల్లీతోపాటు.. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత.. హస్తిన అధికారం చేజిక్కించుకున్న ఆ పార్టీ… భారీగా సీట్లను కైవసం చేసుకుంది. 70సీట్లు ఉన్న ఢిల్లీలో బీజేపీ 48, ఆప్ 22 సీట్ల ఆధిక్యంలో ఉన్నాయి.. అయితే.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం అనంతరం ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి.. విజయోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా తదితర అగ్రనేతలు హాజరయ్యారు.. ప్రధాని మోదీని కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు..

ఈ సందర్భంగా ప్రధాని మోదీ బీజేపీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ఢిల్లీ ప్రజలకు ఆప్ నుంచి విముక్తి లభించిందని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలు తమను గుండెల్లో పెట్టుకుని మరి ఆశీర్వదించారని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజల్లో ఇవాళ ఉత్సాహం కనిపిస్తుందని తెలిపారు.

Published on: Feb 08, 2025 06:34 PM