Watch: ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కార్.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల తెలంగాణకు చెందిన ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కారును కోరుకుంటూ ప్రజలు ఈ రకమైన తీర్పు ఇచ్చారని చెప్పారు. పార్టీ విజయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల ప్రధాని మోదీ, జేపీ నడ్డాకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలు ఉన్న నియోజకవర్గాలన్నింటిలో బీజేపీ ఘన విజయం సాధించిందన్నారు. 12 ఏళ్లుగా ఢిల్లీకి పట్టిన కేజ్రీవాల్ గ్రహణం వీడిందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వానికి ఢిల్లీ ప్రజలు పట్టంకట్టారని అన్నారు. ఢిల్లీ ప్రజలు సుస్థిరమైన పాలన కోరుకున్నారని చెప్పారు. కేజ్రీవాల్ అనేక హామీలు ఇచ్చి చివరకు అవినీతికి పాల్పడ్డారంటూ ధ్వజమెత్తారు. అహంకారం నెత్తికెక్కిన వారికి ప్రజలు బుద్ధిచెబుతారని మరోసారి రుజువైందన్నారు. కేజ్రీవాల్, సిసోడియా ఓటమే దీనికి నిదర్శన్నారు కిషన్ రెడ్డి.

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
