తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం.. పెద్ద ఎత్తున పోటీ పడ్డ స్వతంత్య్ర అభ్యర్థులు..

|

Apr 25, 2024 | 3:33 PM

ఏపీ, తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజు కావడంతో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు స్వతంత్రు కూడా పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. అనుచరులతో కలిసి ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్లు వేశారు. ఇక రేపటినుంచి నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈనెల 29 వరకు నామినేషన్లు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ స్థానాలకు 3,300లకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. 25 పార్లమెంట్ స్థానాలకు 600మందికి పైగా అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

ఏపీ, తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజు కావడంతో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు స్వతంత్రు కూడా పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. అనుచరులతో కలిసి ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్లు వేశారు. ఇక రేపటినుంచి నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈనెల 29 వరకు నామినేషన్లు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ స్థానాలకు 3,300లకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. 25 పార్లమెంట్ స్థానాలకు 600మందికి పైగా అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇటు తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు 600ల మందికి పైగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. దాఖలైన నామినేషన్లను రేపటినుంచి పరిశీలించనున్నారు. ఈసీ రూల్స్‌కి అనుగణంగా అభ్యర్థులు నామినేషన్లను పూర్తి చేశారా లేదా అన్నది క్లియర్‌గా పరిశీలించనున్నారు. ఒకవేళ తేడా వస్తే ఆ నామినేషన్‌ను తిరస్కరిస్తారు. మరోవైపు ఈనెల 29 వరకు నామినేషన్లను విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. వచ్చే నెల 13న ఏపీలో అసెంబ్లీ, ఎంపీ.. తెలంగాణలో ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అలాగే కంటోన్మెంట్ ఉప ఎన్నిక పోలింగ్‌ కూడా అదే రోజు జరగనుంది. జూన్‌ 4న ఫలితాలు వెలువడనున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on