
Bellampalle Congress Public Meeting : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటికే.. విమర్శల వేడి పెంచిన కాంగ్రెస్ వరుస సభలు నిర్వహిస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో తెలంగాణ కాంగ్రెస్ అధక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై రేవంత్ నిప్పులు చెరిగారు. అరాచకాలకు పాల్పడుతున్న వాళ్లకు కేసీఆర్ టిక్కెట్లు ఇచ్చారని విమర్శించారు. దళితులకు, ఆదివాసీలకు కాంగ్రెస్ పాలన తోనే న్యాయం జరుగుతుందన్నారు.ఆదివాసీలను కాంగ్రెస్ మాత్రమే ఆదుకుందని వివరించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కబ్జాకోరు అంటూ రేవంత్ ఫైర్ అయ్యారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..