AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: హైదరాబాద్‌ను అన్ని విధాలుగా అభివృద్ది చేస్తున్నాం

Telangana: హైదరాబాద్‌ను అన్ని విధాలుగా అభివృద్ది చేస్తున్నాం

Srikar T
|

Updated on: Nov 11, 2023 | 2:47 PM

Share

అభివృద్దిలో హైదరాబాద్ న్యూయార్క్‌తో పోటీ పడుతోందన్నారు కేటీఆర్. అన్ని విధాలుగా అభివృద్ది చెందినప్పుడే హైదరాబాద్ విశ్వనగరం అవుతుందన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే పొడి చెత్త నుంచి 24 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. అయితే 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో మరింత ఫోకస్ అవసరం అన్నారు.

అభివృద్దిలో హైదరాబాద్ న్యూయార్క్‌తో పోటీ పడుతోందన్నారు కేటీఆర్. అన్ని విధాలుగా అభివృద్ది చెందినప్పుడే హైదరాబాద్ విశ్వనగరం అవుతుందన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే పొడి చెత్త నుంచి 24 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. అయితే 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో మరింత ఫోకస్ అవసరం అన్నారు. కమర్షియల్ ఏరియాల్లో మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. రోడ్లపై భవన నిర్మాణ శిథిలాలు లేకుండా చర్యలు చేపడతాం అని పేర్కొన్నారు. రోడ్లపై పడేసిన వాటిని తీసుకొని సిమెంట్, కంకర, ఇటుకలు పున:ర్వినియోగించేలా చర్యలు చేపడతామన్నారు. దీని కోసం ప్రత్యేకంగా ఫతుల్ పుర, జీడిమెట్లలో రెండు ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. మరిన్ని ఏడు ప్లాంట్లు త్వరలోనే ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతామన్నారు. చెరువుల ఆక్రమణ జరగకుండా ఇప్పటికే చర్యలు చేపట్టామన్నారు. ప్రజాసమస్యలే ఎజెండాగా 9.5 ఏళ్లు పని చేశామని ప్రజలకు వివరించారు.

మరిన్ని పొలిటికల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Nov 11, 2023 02:43 PM